ప్రజల ఆందోళనలు, ఆగ్రహంతో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రాజీనామా చేయకుండా అనే దేశం విడిచి పారిపోయారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన భార్య సహా ఇద్దరూ అంగరక్షకులతో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేరుకు పరారైనట్లు వైమానిక అధికారి వెల్లడించారు. కాగా అధ్యక్ష పదవికి రాజీనామా విషయంలో తనను దేశం విడిపోయేందుకు అనుమతిస్తేనే.. పదవి నుంచి వైదొలుగుతానని మంగళవారం ఆయన మాట మార్చిన విషయం తెలిసిందే.
తీవ్ర ప్రజాగ్రహం నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి ఈ నెల 13 న వైదొలగుతానని పార్లమెంటు స్పీకర్ కు, ప్రధాని రణిల్ విక్రమ్ సింగ్ కి తెలిపారు. ఈ మేరకు స్పీకర్ మహేంద్ర అభయవర్థనకు రాజీనామా లేఖను కూడా అందించినట్లు సమాచారం. అయితే ఈ నేపథ్యంలో ప్రధాని రనిల్ విక్రమ్ సింగే శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దేశంలో ఎమర్జెన్సీ, అధ్యక్షుడు పరారీలో లంక లో అదుపుతప్పిన పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ప్రధాని రాణిల్ విక్రమ్ సింగే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.