తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం వలన ఆయనకు వచ్చే ఉపయోగం ప్రత్యేకంగా ఏమీ లేదనే విషయం చెప్పవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నిసార్లు చెప్పినా సరే అలాంటి పరిస్థితి మాత్రం తెలంగాణ లేదు అనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. కాబట్టి కొన్ని కొన్ని అంశాలలో చాలా వరకు కూడా ఆ పార్టీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
అయినా సరే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు టిఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయ సహకారాలు అందించారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానంలో కూడా రెండో స్థానంలో అయినా కాంగ్రెస్ పార్టీ నిలబడలేదు. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీచిన ఎక్కడ పరిస్థితి లేదు.
కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడానికి సిద్ధమైనట్లు సమాచారం. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానం తో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే బీజేపీ లోకి వెళ్తారా లేకపోతే మరో పార్టీలోకి వెళ్తారనేది తెలియకపోయినా దాదాపుగా కోదండరాం పార్టీ లోకి రేవంత్ రెడ్డి వెళ్ళే అవకాశాలు ఉండవచ్చు అని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.