నా భార్య జోలికి వచ్చారు.. జగన్ కుటుంబానికి చరిత్ర లేదు : చంద్రబాబు ఫైర్

-

జగన్ సర్కార్ మరోసారి చంద్రబాబు ఫైర్ అయ్యారు. అసెంబ్లీ లో వ్యతిగత దూషణలకు దిగుతున్నారని.. నా భార్య ఎప్పుడు బయటకి రాలేదు.. ఆమె జోలికి వచ్చారని మండిపడ్డారు. నా సతీమణి వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారు, నా కుటుంబం జోలికి వచ్చారని ఫైర్ అయ్యరు. ఏపి అసెంబ్లీ ఒక కౌరవ సభ, మళ్లీ గౌరవ సభ ఏర్పాటు చేసి అసెంబ్లీ లోకి అడుగుపెడితానని ఛాలెంజ్ చేశారు. జగన్ కుటుంబానికి చరిత్ర లేదు, జగన్ ఒక పిచ్చి తుక్లక్ అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు చంద్రబాబు. వరద బాధితులకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తానన్నారు.

వరద బాధితులను ఆదుకోవడంలో జగన్ విఫలమయ్యారని.. హుదూద్ తుఫాన్ సమయంలో నేను బస్సులో ఉంటు మళ్లీ సాధారణ స్థితికి తీసుకొచ్చానని గుర్తు చేశారు. కుప్పం లో ఒక అరాచకం సృష్టించారు, రౌడీయిజం చేసి దొంగ ఓటర్లను తీసుకొచ్చి గెలిచారని నిప్పులు చెరిగారు.  గత రెండు సంవ్సరాలుగా టిడిపి నేతలను, కార్యకర్తలను వేధించారని.. తన ఇంటిపై దాడి చేశారు, రౌడీలను ప్రేరేపిస్తూ టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడికి తెగబడ్డారని అగ్రహించారు. ఏపి నుంచి 20 వేల కోట్ల రూపాయల గంజాయి ఎగుమతి అవుతోందన్నారు. గతంలో అమరావతే ముద్దు అన్నాడు, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అన్నారు, న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బ తగిలే కొద్ది మళ్లీ యు టర్న్ తీసుకున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version