ఈ సంవత్సరపు చివరి చంద్రగ్రహణం నేడు వస్తోంది. ఇది ఉపచాయా చంద్రగ్రహణం. ఈసారి మొత్తం 2 గంటల 45 నిమిషాల పాటు చంద్రగ్రహణం ఉండబోతోంది. ఆసక్తికర విషయమేంటంటే.. ఈ సంవత్సరంలో ఇప్పటికే మూడు చంద్రగ్రహణాలు వచ్చాయి. అవి జనవరి 10, జూన్ 5, జులై 4న వచ్చాయి.
ఉపఛాయా చంద్రగ్రహణం అంటే ఏంటి?
చంద్రగ్రహణాల్లో 3 రకాలున్నాయి. నేడు వచ్చేది ఉపఛాయా చంద్రగ్రహణం. అంటే ఇది వచ్చినప్పుడు సూర్యుడు, భూమి, చందమామ మూడూ ఒకే రేఖపై ఉంటాయి. సూర్యుడి నుంచి వచ్చే కొంత కాంతిని భూమి అడ్డుకుంటుంది. ఫలితంగా ఆ కాంతి చందమామ ఉపరితలాన్ని చేరదు.
మనకు కనిపించదు:
ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు. సూర్యుడి కాంతి వల్ల ఇండియాలో ఎక్కడా దీన్ని చూసే అవకాశం లేదు. బీహార్, యూపీ, అసోం, ఉత్తరాఖండ్, ఢిల్లీ, ముంబై లాంటి చోట్ల స్వల్పంగా మాత్రమే కనిపించే అవకాశాలు ఉన్నాయి. యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్ ప్రాంత ప్రజలు మాత్రం దీన్ని చూడగలరు. ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం డిసెంబర్ 14న రాబోతోంది.
ప్రభావం తక్కువే:
నేటి చంద్రగ్రహణం ప్రభావం భారతీయులపై అంతగా ఉండదని పండితులు తెలిపారు. హిందూ పురాణాల ప్రకారం ఉపఛాయా చంద్రగ్రహణానికి అంతగా ప్రాధాన్యం ఉండదని వివరించారు.