ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటూ సెల్ టవర్ ఎక్కాడు పంచాయతీ కార్మికుడు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలిగొండ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి కోసం అప్లై చేస్తే రిజెక్ట్ చేశారని సెల్ టవర్ ఎక్కాడు పంచాయతీ కార్మికుడు పామర్తి శ్రీను. 2008లో తనకు భార్య పేరుతో ఇందిరమ్మ ఇల్లు ముంజూరైతే వేరే వాళ్లు ఇల్లు కట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. నిజ నిర్ధారణ చేయాలంటూ అధికారులను కోరాడు శ్రీను.
కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు నకిలీ ధ్రువపత్రాలతో తన పేరు మీద ఇల్లు మంజూరు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తనకు ఇల్లు లేక ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇంటి కోసం అప్లై చేస్తే రిజెక్ట్ చేశారు అధికారులు. తన సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ సెల్ టవర్ ఎక్కాడు పామర్తి శ్రీను. దీంతో అధికారులు నచ్చజెప్పి అతన్ని కిందికి దించారు.