బాబు బాటలో రేవంత్…ఆ ఫార్ములా వర్కౌట్ అవుతుందా?

-

ప్రతిపక్షంలో ఉండే ఏ నాయకుడైన..తమ కార్యకర్తలని ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకు రాజకీయంగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలో చేస్తుంటారు. దాని వల్ల కార్యకర్తలు ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ, పార్టీ తరుపున గట్టిగా నిలబడి అధికార పార్టీపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఇదే ఫార్ములాని ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అమలు చేస్తున్నారనే చెప్పొచ్చు.

అక్కడ అధికార వైసీపీ దెబ్బకు ప్రతిపక్ష టీడీపీ నేతలు, కార్యకర్తలు బాగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అందుకే వారికి అండగా ఉంటూ, అధికార వైసీపీపై చంద్రబాబు నిత్యం ఏదొక అంశంపై విమర్శలు చేస్తారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఎక్కువకాలం ఉండదని, త్వరలోనే వైసీపీ దిగిపోతుందని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చేది టీడీపీనే అని, అప్పుడు తమని ఇబ్బంది పెట్టినవారిని ఎవరిని వదిలిబెట్టేది లేదంటూ చంద్రబాబు ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అంటే దాని వల్ల కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం ఉంటుంది.

అయితే ఇదే ఫార్ములాని తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా వాడుతున్నారు. పీసీసీ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి దూకుడుగా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అలాగే మరో 20 నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగుతుందని, ఆ తర్వాత వచ్చేది సోనియమ్మ రాజ్యమే అంటూ రేవంత్ కార్యకర్తలని ఉత్సాహపరిచే స్పీచ్‌లు ఇస్తున్నారు.

మళ్ళీ ముందస్తు ఎన్నికలు వస్తాయని, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడగొట్టడం ఖాయమని అంటున్నారు. చంద్రబాబు కూడా జమిలి ఎన్నికలు వస్తాయనో, లేక జగన్ ప్రభుత్వం త్వరగా పడిపోతుందో అని మాట్లాడుతూ కార్యకర్తల్లో జోష్ నింపుతారు. అంటే చంద్రబాబు, రేవంత్‌లు ఒకే రూట్‌లో వెళుతూ రాజకీయాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version