నీదో నీచ రాజకీయం.. రాజారెడ్డి రాజ్యాంగం..! జగన్ పై ధ్వజమెత్తిన బాబు..!

-

chandrababu slams ys jagan mohan reddy
chandrababu slams ys jagan mohan reddy

ఏ‌పీలో రాజకీయ సెగలు ఎగిసిపడుతున్నాయి.. ఇరుపక్షాల నేతలు ఒకరి పై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. ఈనేపద్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై‌ఎస్ జగన్ పై ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. టీడీపీ సీనియర్ నాయకులతో నిర్వహించిన ఆన్‌లైన్‌ సమావేశంలో ఆయన జగన్ పై ధ్వజమెత్తారు ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీస్ జులుం నడుస్తుందని జగన్ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. విపక్ష నేతలపై అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి అక్రమాలు మోపి సీబీఐ విచారనలంటూ హింశిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో జగన్ పాలన వల్ల ప్రజలందరికీ ముప్పేనని ఆయన అన్నారు. తమ పార్టీలోని ఎంపీ లకే ప్రాణాపాయం ఉందని ఈమేరకు ఆ ఎంపీ స్పీకర్ కు కూడా లేఖ రాశారని ఆయన గుర్తుచేశారు. ఎంపీలకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించాడు. కుంభకోణాలు చేయడం అలవాటున్న జగన్ కరోనా సమయంలోనూ కుంభకోణాలు చేస్తున్నాడని అంబులెన్స్ వ్యవహారంలో 408 కోట్ల కుంభకోణం దాగుందని ఆయన ఆరోపించారు. ఇక మరోపక్క అధికార పక్షంలోని ఎంపీ విజయసాయి రెడ్డి ప్రతిపక్షం లోని మాజీ మంత్రి లోకేశ్ లు ట్విటర్ వేధికగా ఒకరి పార్టీ పై ఒకరు వ్యంగ్యస్త్రాలు విసురుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version