ప్రజా ప్రశ్న: చుట్టం చూపంటున్న సుజనా… అంత ఈజీనా?

-

ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేని, ఒక ఎంపీ ఇంకో ఎంపీని.. ఒక రాజకీయ నాయకుడు మరో రాజకీయ నాయకుడిని ఎక్కడ కలిసినా, ఎప్పుడు కలిసినా, ఎలా కలిసినా, ఎవరెవరి సమక్షంలో కలిసినా.. ప్రజలెవరికీ సంబందం లేదు.. పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు! కానీ.. రాజ్యాంగ పదవిలో ఉండి, ఒక పార్టీ నేతలతో రహస్యంగా భేటీ ఆవడాన్ని కూడా జనాలు లైట్ తీసుకుంటారా? కనీస విలువలు లేని విధంగా ఆ నాయకులు మాట్లాడతారా? ఏమో… పార్క్ హయత్ రహస్య భేటీపై సుజనా స్పందన విన్నవారికి అలాంటి అనుమానాలు కలుగుతున్నాయంట.

ఈరోజు ఉదయం నుండి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో భేటీ అయిన విషయం మీద రాజకీయంగా పెద్ద దుమారమే లేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలపై స్పందించిన సుజనా.. తాము మంచి స్నేహితులమని, తమకు ఇష్టమొచ్చినప్పుడు, ఇష్టమొచ్చినట్లు, ఇష్టమొచ్చిన చోట కలుస్తాము అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ విషయంపైనే రచ్చ పీక్స్ కి చేరుతుంది.

రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు రాజకీయ నాయకులతో రహస్య భేటీలు చేయకూడదని రాజ్యాంగంలో ఉండి ఉండకపోవచ్చు.. చట్టంలో దానికి సంబందించి ఎలాంటి సెక్షనూ లేకపోవచ్చు.. కానీ ప్రజాస్వామ్యంలో వాటితో పాటు విలువలు, జనాల అభిప్రాయాలు అనేవి చాలా ఉంటాయి! తమ పార్టీ నేతలు మరో పార్టీ నేతలకు కలిస్తేనే షోకాజు నోటీసులు ఇచ్చేస్తున్న అధినేతలున్న రోజులివి. ఆసంగతులు అలా ఉంటే… ఇది మా ఇష్టం అన్నట్లుగా సుజనా మాట్లాడటం రాజకీయ కోణం అని లైట్ తీసుకున్నా.. అధిష్టాణానికి తెలిసే నడిచిందన్నా.. చేయగలిగిందేమీ లేకపోవచ్చు. కానీ… నిమ్మగడ్డపై వైకాపా నుంచి, ఏపీ సర్కార్ నుంచి వస్తోన్న వాదనలకు ఇది ఎంత బలం చేకురుస్తుందో అర్ధం చేసుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం అన్న విషయం మస్థిష్కంలో ఉంచుకోవాలి.

ఈ విషయంపై హైకోర్టు సుమోటోగా స్వీకరించే స్థాయిలో స్పందిస్తుందా.. మరెవరైనా పెద్దలు, మేధావులు అనబడేవారు, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలనుకునేవారు, రాజ్యంగ పదవుల్లో ఉన్న పెద్దలు ఇలా ప్రజలకు అనైతిక సంకేతాలు ఇవ్వకూడదని భావించేవారు ఎవరైనా కోర్టుల ద్వారా కానీ.. మరో ఫ్లాట్ ఫాం పై కానీ స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా, ఎవరు ఎలా స్పందించినా.. ఈ విషయం మాత్రం “చుట్టం చూపుకా కలిశాం” అని సుజనా చౌదరి చెప్పినంత సులువైన సంగతి మాత్రం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు!

తమ ఓట్లు కరెక్టుగా పడతాయి, తమ ఓటు తామే వేసుకోవచ్చు, స్థానిక ఎన్నికలు సజావుగా జరుగుతాయి, ఎన్నికల్లో తమ తమ అభిప్రాయాలు నిజాయితీగా లెక్కించబడతాయి, అని ఎన్నికల కమిషన్ ను ప్రజలు ఎంతో నిజాయితీగా నమ్ముతారు.. నమ్ముతున్నారు. మరి వారి నమ్మకాన్ని నిలబెట్టే పనులు ఎవరు చేస్తారు? కేంద్ర ఎన్నికల కమిషనా.. న్యాయాస్థానాలా.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న పెద్దలా.. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలా.. మీడియా సంస్థలా…? ఎవరైనా పర్లేదూ! జనాలు కోరుకునేది మాత్రం నమ్మకం.. సమాధానం అంతే!!

Read more RELATED
Recommended to you

Exit mobile version