చంద్రబాబు రోడ్ షోలో 8 మంది టీడీపీ కార్యకర్తలు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కందుకూరు ఎన్టీఆర్ సర్కిల్‌లో బాబు సభలో తొక్కిసలాట జరిగి టీడీపీ కార్యకర్తలు చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగేప్పుడు బాబు అక్కడే ఉన్నారు..కానీ ఊహించని విధంగా ప్రమాదం జరగడం 8 మంది మరణించడం జరిగింది. దీంతో బాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. అలాగే బాధిత కుటుంబాలని ఆదుకుంటామని చెప్పారు.
అలా చెప్పినట్లుగానే గాయపడిన వారికి ఆర్ధిక సాయం చేయడం, వారి చికిత్సకు అయ్యే ఖర్చు పార్టీ భరిస్తుందని చెప్పారు. ఇక చనిపోయిన వారి కుటుంబాలకు గురువారం వరుసగా వెళ్ళి..కుటుంబ సభ్యులని పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి పార్టీ తరుపున 15 లక్షలు, టీడీపీ నేతలు తరుపున మరో 10 లక్షలు ఇచ్చారు. మొత్తం 25 లక్షలు ఇచ్చారు. ఇక చనిపోయిన వారికి 2 లక్షలు, గాయపడ్డ వారికి 50 వేలు చొప్పున పిఎం మోదీ, సీఎం జగన్ ఆర్ధిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే కందుకూరు ఘటనపై అన్నీ పార్టీలు సంతాపం తెలియజేశాయి. కానీ అధికార వైసీపీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టి..ఇరుకు రోడ్డులో ఎక్కువ మంది జనాలని పెట్టి..వారి మరణాలకు కారణమయ్యారని విమర్శలు చేశారు. వైసీపీ నుంచి మాట్లాడిన ప్రతి నాయకుడు..అదే విమర్శ చేశారు. తమ కార్యకర్తల చనిపోయిన బాధలో ఉన్నామని, అదే సెంటర్‌లో జగన్ సైతం రోడ్ షో పెట్టారని, ఇంకా పలువురు నేతలు సభలు పెట్టారని, కానీ ఇప్పుడు జనం భారీగా రావడంతోనే ఇబ్బందులు వచ్చాయని, పైగా పోలీసు సెక్యూరిటీ తక్కువగా ఉందని టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇచ్చాయి.
వైసీపీ విమర్శలు చేసిన బాబు వెనక్కి తగ్గలేదు. బాధిత కుటుంబాలని ఆదుకున్నాకే చంద్రబాబు..కావలి రోడ్ షోకు వెళ్లారు. ముందుగానే షెడ్యూల్ ఖరారు కావడంతో..సాయంత్రం కావలి రోడ్ షోలో పాల్గొన్నారు. అక్కడ కూడా భారీగానే జనం వచ్చారు. ఇక కందుకూరు ఇష్యూని కూడా రాజకీయం చేయడం దురదృష్టకరమనే అనాలి.