బ్రేకింగ్ : ప్రెస్ మీట్ లో గుక్క పెట్టి ఏడ్చిన చంద్రబాబు

-

తెలుగు దేశం పార్టీ అధినేత… చంద్రబాబు నాయుడు.. మరోసారి కంట తడి పెట్టుకున్నారు. అసెంబ్లీ నుంచి టీడీపీ ఆఫీస్‌ కు వచ్చి… చంద్రబాబు నాయుడు.. ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఒక్క సారిగా బోరున ఏడ్చేసారు చంద్ర బాబు నాయుడు. వైసీపీ సర్కార్‌ చాలా దారుణంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు.

వ్యక్తి గత విమర్శలు చేయడం సరికాదన్నారు. తాను ప్రజల కోసమే ఉద్యమాలు, పని చేశానని పేర్కొన్నారు. తాను ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.
రెండున్నరేళ్లు గా తనను అవమానిస్తున్నారని… తన భార్య విషయం కూడా తీసుకు వచ్చారని ఆయన తెలిపారు. ఓడి పోయినప్పుడు తాను కుంగిపోలేదని… గెలిచినప్పుడు ఎన్నడూ రెచ్చిపోలేదని తెలిపారు. జాతీయ స్థాయిలో పెద్ద నేతలతో పని చేశామని… కానీ ఎన్నడూ ఇలాంటి అవమానం జరుగలేదన్నారు చంద్రబాబు.  అసెంబ్లీ స్పీకర్‌ కూడా చాలా దారుణం గా వ్యవహరిస్తున్నారని ఫైర్‌ అయ్యారు చంద్రబాబు.

అన్నీ భరించి అసెంబ్లీకి వెళ్తే.. నా భార్యను రాజకీయాల్లోకి లాగుతున్నారని…నా భార్య వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది వైసీపీ అని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండే వ్యక్తులని ఉద్దేశించి ఇలా నా జీవితంలో ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. గౌరవంగానే వ్యవహరించామని తెలిపారు. పార్టీ కార్యకర్తలను హింసించేవారు.. బూతులు తిట్టారు.. అయినా భరించామని వెల్లడించారు. బీఏసీలో అచ్చెన్నాయుడుతో వ్యంగ్యంగా సీఎం జగన్ మాట్లాడారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version