టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విషయంలో జగన్ తో కలిపి వైకాపా నేతలు అంతా సానుకూలంగానే స్పందిస్తున్నారన్న విషయాలపై ఇప్పటికే చాలా క్లారిటీలు వచ్చాయి. అయితె… బాలయ్య అభిమానసంఘానికి ఒకప్పుడు జగన్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేసిన సంగతి తెలిసిందే. తాను సీఎం అయినా కూడా బాలయ్యపై జగన్ కున్న అభిమానం ఏమీ తగ్గలేదు! ఈ క్రమంలో బాలయ్యను తమ మనిషిగానే చూస్తున్నారు వైకాపా నేతలు!!
ఆ సంగతులు కాసేపు పక్కనపెడితే… ఈ మధ్యకాలంలో బాలయ్య.. జగన్ సర్కార్ పై బలమైన విమర్శలే చేశారు. వాటిలో ప్రధానమైంది… ఈ ప్రభుత్వం పూర్తికాలం ఉండదని.. మధ్యలోనే ముగిసిపోతుందని మహానాడు వేదికగా స్పందించారు! కరోనా విషయంలో కూడా మరింతగా ముందుకువెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు కూడా! అనంతరం కరోనా మహమ్మారి ఏపీని ఆవరించిన వేళ కోటి రూపాయల సాయం కూడా చేశారు! ఎంతైనా కుర్చీలో ఉన్నది తన అభిమాని కదా!!
ఇదే క్రమంలో తాజాగా హిందూపురం విషయానికొచ్చేసరికి జగన్ ని రెండు కోరికలు కూడా కోరారు. అది బావ చంద్రబాబుకు తెలిసే కోరారా లేక కేవలం తన నియోజకవర్గ ప్రజల అభిష్టం మేరకు సొంత నిర్ణయం తీసుకున్నారా అనేది తెలియదు కానీ… మెడికల్ కాలేజీ కావాలి, హిందూపుర్ ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కూడా కోరారు. ఈ క్రమంలో అడిగింది తన అభిమాన హిరో కావడంతో… ఆ రెండు రిక్వస్ట్ ల విషయంలో కూడా జగన్ సానుకూలంగా స్పందించడంతోపాటు.. అధికారులతో కూడా చర్చించారని చెబుతున్నారు!
అలాగే నెల్లూరు జిల్లా కావలిలోని ఎన్ టీఆర్ విగ్రహాన్నీ తొలగించిన సమయంలో కూడా… స్థానిక వైకాపా ఎమ్మెల్యే నేరుగా బాలయ్యకు ఫోన్ చేసి మరీ… విగ్రహాన్ని మరో సేఫ్ ప్లేస్ లో ఏర్పాటు చేస్తున్నామని.. జగన్ గారికి కూడా తెలిపామని.. సీఎం కూడా సానుకూలంగా స్పందించారని ప్రకటించారు! ఈ విషయాలపై బాలయ్య కూడా హ్యాపీ ఫీలయ్యారని తెలిసింది. దీంతో… జగన్.. బాలయ్య మనసు దోచుకున్నారని అంటున్నారు!
ఇదంతా ఒకెత్తు అయితే… ఈ విషయాలపై బాబు కాస్త ఇబ్బందిగా ఫీలవుతున్నారని.. అంటున్నారు సీబీఎన్ అభిమానులు! ఇవన్నీ జరిగితే ఈ పరిణామాల అనంతరం బాలయ్య మరింతగా జగన్ సర్కార్ మీద మమకారం పెంచుకుంటారనే భయం బాబు గుండెల్లో గోల పెడుతుందంట. ఇదే క్రమంలో కొందరు టీడీపీ నాయకులు కూడా… బాబు దగ్గర ఈ విషయాన్ని ప్రస్థావించి.. ఇలాగైతే కార్యకర్తలకు మరోరకం సంకేతాలు వెళ్తాయని అంటున్నారట. మరి ఈ విషయాలపై.. బావ చంద్రబాబును బాలయ్య ఎలా జోకొడతారు అనేది ఆసక్తిగా మారింది!