మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే.. ఇటీవల వైసీపీ సర్కారుపై విమర్శలు చేసి, ఆ పార్టీ నేతల చేతిలో దాడికి గురైన వెంకాయమ్మ కుటుంబంపై మరోసారి దాడి జరిగిందని చంద్రబాబు వెల్లడించారు. మొన్న వెంకాయమ్మపై దాడి జరిగిందని, నేడు ఆమె కుమారుడిపై దాడి జరిగిందని చంద్రబాబు తెలిపారు. వెంకాయమ్మ కుటుంబంపై దాడిని ఖండిస్తున్నట్టు వెల్లడించారు. జగన్ పాలనపై విమర్శలు చేస్తే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు చంద్రబాబు.
అరాచక శక్తులు దాడులు చేస్తుంటే పోలీసులు ఏంచేస్తున్నారని మండిపడ్డ చంద్రబాబు.. వెంకాయమ్మ కుటుంబంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వెంకాయమ్మ స్వగ్రామం గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు. జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆమెపై దాడి జరగ్గా, టీడీపీ అండగా నిలిచింది.