టీఆర్ఎస్ రాష్ట్రంలో ఆరిపోయే దీపం లాంటింది : ఈటల రాజేందర్‌

-

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవటం..బీజేపీ గెలువటం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఒకసారి టీఆర్ఎస్ ఓడిపోతే మళ్లీ గెలిచే అవకాశం లేదని, గోల్‌మాల్ చేయాలనుకున్నప్పుడు.. ప్రజలను తప్పుదోవ పట్టించాలన్నప్పుడు కేసీఆర్ మీడియా ముందుకు వస్తాడని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కు నేను..నా కుటుంబమనే ఆహం పెరిగిందని, తెలంగాణ సంపందకు ప్రజలు యజమానులు …కేసీఆర్ కాదని ఆయన వ్యాఖ్యానించారు. 20 ఏళ్లుగా కేసీఆర్ తో కలిసి పనిచేసిన అనుభవం నాది అని, హుజూరాబాద్ ఎన్నికల్లో 600 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు చేశావ్.. అని ఈటల ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు, ప్రమాదంలో చనిపోయినవారిపై లేని ప్రేమ పంజాబ్ రైతులపై ఎందుకు.. ఎవరబ్బా సొమ్మని 250 కోట్ల రూపాయలు ఖర్చు
చేసి దేశంలో ప్రకటనలు ఇచ్చావు అని, ఏడాదికి 40 వేల కోట్ల రూపాయల మద్యం ఆదాయం ఉందని చెప్పుకునే సిగ్గులేని ప్రభుత్వం టీఆర్ఎస్ ది అని ఆయన మండిపడ్డారు.

సీఎస్, కలెక్టర్లు మద్యంను ప్రమోషన్ చేసే పనిలో ఉన్నారు. వీటిపై సమీక్షలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో 6 లక్షల 80 వేల మంది మద్యంకు బానిసలైన కుటుంబాలు ఉన్నాయన్నారు. రోజురోజుకు పెరుగుతున్న పబ్ కల్చర్ ను బీజేపీ రూపుమాపుతుందని, ఫూడల్ రాజకీయ మనస్ధత్వం గల వ్యక్తి కేసీఆర్ అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజానాడి తెలిసిన ప్రజానాయకుడికి పీకే అవసరం ఎందుకొచ్చింది కేసీఆర్ కు పోయేకాలం వచ్చినందుకే.. టీఆర్ఎస్ రాష్ట్రంలో ఆరిపోయే దీపం లాంటిందని ఆయన ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version