ఇటీవల చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజులు పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టిడిపి శ్రేణులు పోలీసులపై కూడా దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు పలువురు టిడిపి కార్యకర్తలపై కేసులు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేయగా.. మరికొంతమంది అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే టిడిపి కార్యకర్తల అరెస్టుపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు.
” కుప్పంలో టిడిపి కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాను. పోలీసులే తప్పుడు ఫిర్యాదులతో నాలుగు తప్పుడు ఎఫ్ఐఆర్ లు రాసి చేస్తున్న ఈ అరెస్టులు రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలనకు నిదర్శనం. ఎఫ్ఐఆర్ లో ఇతరులు అని పెట్టి.. వైసిపి నేతల సూచనల ప్రకారం టిడిపి కార్యకర్తలను అరెస్టు చేస్తున్న పోలీసులు మూల్యం చెల్లించుకుంటారు. ఫిర్యాదులు చేసిన ఎస్ఐలు, సీఐలు.. వెనకాల ఉండి కద నడిపిస్తున్న డిఎస్పీలు, ఎస్పీలు తాము చేస్తున్న తప్పులకు తప్పక శిక్ష అనుభవిస్తారు ” అని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు చంద్రబాబు.
కుప్పంలో టీడీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాను. పోలీసులే తప్పుడు ఫిర్యాదులతో 4 తప్పుడు FIR లు రాసి చేస్తున్న ఈ అరెస్టులు రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలనకు నిదర్శనం. ఎఫ్ఐఆర్ లో 'ఇతరులు' అని పెట్టి…. వైసీపీ నేతల సూచనల ప్రకారం..(1/2) pic.twitter.com/I7SDpeEMBa
— N Chandrababu Naidu (@ncbn) January 9, 2023