అవినీతి, అక్రమాలకు ప్రతిరూపం జగన్ రెడ్డి : చంద్రబాబు

-

కర్నూలు జిల్లాలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 3 రోజుల పాటు పర్యటించనున్నారు. అయితే.. నేడు మొదటి రోజు కోడుమూరులో చంద్రబాబు రోడ్ షోకు జనం భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవినీతి, అక్రమాలకు ప్రతిరూపం జగన్ రెడ్డి అని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు. కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టింది తెలుగుదేశం పార్టీయేనని వెల్లడించారు చంద్రబాబు. ఈ మూడేళ్లలో ఒక్క పని అయినా చేశారా? అంటూ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజమెత్తారు. రోడ్లపై గుంతలు పడితే మట్టి వేయలేని సీఎం మూడు రాజధానులు కడతారా? అంటూ నిలదీశారు. ఆఖరికి చెత్తపై కూడా పన్ను వేసిన చెత్త సీఎం జగన్ రెడ్డి అంటూ విమర్శించారు చంద్రబాబు.

“ఈ ముఖ్యమంత్రి ఒక జాబ్ కాలెండర్ ఇచ్చాడా? ఏంచేశాడు ఈ ముఖ్యమంత్రి? అందరినీ ఇబ్బందులు పెడుతున్నాడు. ఎవరన్నా గట్టిగా నిలదీస్తే పోలీసులు మీ ఇంటికి వస్తారు… పోలీసులకు న్యాయం చేశాడా అంటే అదీ లేదు. ఇప్పుడీ పోలీసుల పొట్ట కొడుతున్నాడు ఈ జగన్ రెడ్డి. పోలీసులూ… మీ డీఏలు, పీఎఫ్ లు వస్తున్నాయా? మీక్కూడా ఏమీ రావడం లేదు. మీరు కూడా ఈ రాష్ట్రంలో భాగమే. ఓసారి నేను గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే రూ.18 కోట్లు వచ్చారు. నేను మళ్లీ మాట్లాడితేనే మీ డబ్బులు వస్తాయి… ఆ విషయం పోలీసులు గ్రహించాలి. పోలీసులు ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని హితవు పలికారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version