శాసన మండలి రద్దు బిల్లు ఇప్పుడు బీజేపీ పార్టీ పెద్దల చేతిలో ఉండటంతో టిడిపి అధినేత చంద్రబాబు ఎలాగైనా ఈ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందకుండా చూడాలని నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి పార్టీ మరియు మోడీ ని దారుణంగా విమర్శించి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడంతో చంద్రబాబుని చాలా దారుణంగా బిజెపి పార్టీ పెద్దలు చూడటం జరిగింది.
చాలా సందర్భాలలో బిజెపితో కలవాలని ఓడిపోయిన తర్వాత చూసిన చంద్రబాబుకి బిజెపి నుండి ఎటువంటి స్పందన రాలేదు. అయితే ఇటువంటి తరుణంలో బీజేపీతో ఇటీవల పోస్టులు పెట్టి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం.
ముఖ్యంగా శాసన మండలి రద్దు అయితే తన కొడుకు లోకేష్ రాజకీయ జీవితం ప్రమాదకర స్థితికి పెళ్లి పోయినట్లే అని భావిస్తున్న చంద్రబాబు ఎలాగైనా శాసన మండలి రద్దు బిల్లును ఆపాలని పవన్ కళ్యాణ్ కి తన పార్టీకి చెందిన నమ్మకమైన నేతలతో రాయబారం పంపినట్లు..బిజెపి పార్టీ పెద్దలతో పవన్ కళ్యాణ్ మాట్లాడి శాసన మండలి రద్దు బిల్లుకు ఆమోదం రాకుండా చూడాలని చంద్రబాబు…పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేసినట్లు ఏపీలో వార్తలు వినబడుతున్నాయి.