పులివెందులలో బస్టాండ్..బాబుకు చెక్ అంటున్నారే.!

-

ఇంతకాలం సంక్షేమ పథకాలపైనే ఎక్కువ ఫోకస్ చేసిన జగన్..ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఫోకస్ పెట్టారు. ఎక్కడక్కడ శంఖుస్థాపనలు చేస్తున్నారు. కొత్త ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అయితే అభివృద్ధి చేయలేని సీఎం మూడు రాజధానులు కడతారని, కనీసం తన సొంత నియోజకవర్గం పులివెందులలో బస్టాండ్ కట్టలేని సీఎం మూడు రాజధానులు కడతారా? అని చంద్రబాబు, టీడీపీ శ్రేణులు ఎగతాళి చేస్తూ వచ్చాయి. ఇక వారి విమర్శలకు చెక్ పెడుతూ.. అద్భుతంగా పులివెందుల బస్టాండ్ నిర్మాణం జరిగింది. తాజాగా బస్టాండ్‌ని జగన్ ప్రారంభించారు. దీంతో ఇదిగో బస్టాండ్ చంద్రబాబు మాదిరిగా గ్రాఫిక్స్ చేయలేదని, ఇది నిజమైన బస్టాండ్ అంటూ వైసీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.

పులివెందులలో బస్టాండ్ కట్టి…బాబు బ్యాచ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ఇక వైసీపీ శ్రేణులకు టీడీపీ వాళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు. రెండేళ్ల కిందట ఇదిగో పులివెందుల బస్టాండ్‌ నమూనా అని జగన్‌ చూపించిన గ్రాఫిక్స్‌కు… తాజాగా ఆయన ప్రారంభించిన బస్టాండ్‌కూ ఏమాత్రం పొంతనలేదని అంటున్నారు. పైగా నలభై ఏళ్ల నుంచి పులివెందులని పాలిస్తున్నది జగన్ ఫ్యామిలీ అని, అయినా సరే ఒక్క బస్టాండ్ కట్టుకోలేకపోయారా? అని ఎద్దేవా చేస్తున్నారు. ఇలాంటివి బాబు ఎన్నో కట్టించారని, కుప్పంలో ఎప్పుడో బస్టాండ్ కట్టించారని చెబుతున్నారు.

2014లో అధికారంలోకి వచ్చాక విజయవాడ బస్టాండ్ రూపు రేఖలు మార్చారని…హైటెక్ తరహాలో బస్టాండ్ కట్టారని చెప్పి ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేస్తే అర్ధం ఉంటుందని, పులివెందులలో చేస్తే జగన్‌కే అడ్వాంటేజ్ అని, దాని వల్ల టీడీపీకి పోయిదేమీ లేదని అంటున్నారు. మొత్తానికి బస్టాండ్‌లపై కూడా ఏపీలో రాజకీయాలు నడుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version