బీసీలను ఓటు బ్యాంకులా చూసిన దుర్మార్గుడు చంద్రబాబు – మంత్రి పెద్దిరెడ్డి

-

బడుగు బలహీన వర్గాల పక్షపాతి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అని.. బీసీలను ఓటు బ్యాంకుగా చూసిన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైసీపీ నుంచి పశ్చిమ రాయలసీమ పట్టబద్రుల స్థానానికి వెన్నపూస రవీంద్ర రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎంవి రామచంద్రారెడ్డి, అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి మంగమ్మ నేడు నామినేషన్లు దాఖలు చేశారు.

ఈ నామినేషన్ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసిపి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. దేశంలోనే తొలిసారిగా వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్య ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version