ఏపీ డీజీపీ కసిరెడ్డికి చంద్రబాబు బహిరంగ లేఖ

-

డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై సీఐడీ వేధింపులు సరికాదని… గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావులను అక్రమంగా అదుపులోకి తీసుకుని సీఐడీ పోలీసులు వేధించారని లేఖలో చంద్రబాబు వివరించారు.

అర్ధరాత్రి గోడలు దూకి తలుపులు పగలగొట్టి నోటీసుల పేరుతో వేధింపులకు గురిచేశారని.. ఇంట్లో ఆడవాళ్లు ఉన్న సమయంలో అక్రమంగా ఇంట్లోకి చొరబడి కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేశారన్నారు. అక్రంగా కస్టడీలోకి తీసుకుని సీఐడీ పోలీసులు తీవ్రంగా వేధించారని.. గంటల తరబడి స్టేషన్‍లో బట్టలు లేకుండా కూర్చోబెట్టి దాడికి పాల్పడం దారుణమని ఆగ్రహించారు. విచారణ గదిలో ఎటువంటి సీసీ కెమెరాలు లేవని… అరెస్టు చేసే సమయంలో, విచారణ సమయంలో సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా సీఐడీ పోలీసులు వ్యవహరించారన్నారు.

కొందరు కళంతకితమైన అధికారుల సహకారంతో ప్రతిపక్షాలను ప్రభుత్వం రాజకీయ వేధింపులకు గురి చేస్తోందని.. టీడీపీ శ్రేణులపై బెదిరింపు చర్యలకు దిగుతున్నారని ఫైర్‌ అయ్యారు. అక్రమంగా అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం సీఐడీ అధికారులకు ఏంటి..? నేరపూరితమైన కుట్రలకు పాల్పడిన సీఐడీ అధికారులపై చర్యలు తీసుకుని.. బాధితులకు అండగా నిలబడాలని లేఖలో చంద్రబాబు కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version