BREAKING : సిగ్గుమాలిన సీఎం అంటూ జగన్‌పై చంద్రబాబు సంచలనం

-

పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. నేడు చంద్రబాబు జంగారెడ్డిగూడెంలో బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ పై ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీకి కంచుకోట అని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిందని, ఇప్పుడదే సీన్ 2024 ఎన్నికల్లో రిపీట్ అవుతుందని జగన్ వణికిపోతున్నాడని వ్యాఖ్యానించారు చంద్రబాబు. సిగ్గుమాలిన ముఖ్యమంత్రి… ఆడపిల్లల చున్నీలు కూడా తీసేయించిన ఈ పిరికి ముఖ్యమంత్రికి తెలుగుదేశం పార్టీ చుక్కలు చూపించడం తథ్యం అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలను ఉద్దరించానంటున్న జగన్ రెడ్డీ… ఆయా సామాజికవర్గాల్లో ఉన్న జనాభా ఎంత, ఇస్తున్న సాయం ఎంతమందికి? అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. “స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 24 శాతం ఉన్న రిజర్వేషన్లను 34 శాతానికి పెంచాం. కానీ ఈ జగన్ రెడ్డి ఆ
రిజర్వేషన్లను 24 శాతానికి కుదించాడు.

టీడీపీ ఐదేళ్ల పాలనలో సబ్ ప్లాన్ ద్వారా రూ.36 వేల కోట్లు కేటాయించి.. రూ.30 వేల కోట్లు ఖర్చు చేశాం. కానీ.. ఈ జగన్ రెడ్డి అందరికీ ఖర్చు చేసిన నిధులను బీసీలకు చేసినట్లు చెబుతున్నాడు. నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ అన్న జగన్ రెడ్డి.. టీటీడీలో 37 మంది సభ్యులుంటే… రిజర్వేషన్ కింద ఇచ్చింది ముగ్గురికి. ఇదేనా 50 శాతం రిజర్వేషన్? రాష్ట్రంలో 12 యూనివర్శిటీలుంటే… టీడీపీ హయాంలో 9 వర్శిటీలకు వీసీలుగా బీసీలను నియమించాం. ప్రస్తుతం 10 యూనివర్శిటీల వీసీలు రెడ్లే, చివరికి వీసీలతో పాటు రిజిస్ట్రార్లుగా కూడా సొంత వర్గంతో నింపుకున్నారు. అసలు ఏమాత్రం సంబంధం లేని ఎన్టీఆర్ వర్శిటీకి కూడా రెడ్డి పేరు పెట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version