బీజేపీకి బాబు-జగన్ హెల్ప్.. కేసీఆర్‌కు చెక్..?

-

తెలంగాణలో కేసీఆర్‌కు ఎలాగైనా చెక్ పెట్టి అధికారం దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. మూడోసారి టీఆర్ఎస్‌ని మాత్రం అధికారంలోకి రానివ్వకూడదు అని బీజేపీ గట్టిగా ట్రై చేస్తుంది. ఇదే క్రమంలో బీజేపీ…తమదైన శైలిలో వ్యూహాలు వేసుకుంటూ ముందుకెళుతుంది. ఎక్కడకక్కడ పార్టీ బలోపేతం అయ్యేలా ముందుకెళుతుంది. అలాగే ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నాయకులని బీజేపీలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు.

ఇక ఏపీ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌పై కూడా బీజేపీ ఎక్కువ ఫోకస్ చేసింది. అటు ఖమ్మంలో కూడా కాస్త ప్రభావం ఉంటుంది. ఏదేమైనా గాని తెలంగాణలో దాదాపు 25 పైనే సీట్లలో ఏపీ ఓటర్ల ప్రభావం ఉంటుంది. అందుకే వారి మద్ధతు దక్కించుకుంటే విజయానికి చేరువ కావొచ్చు అనేది బీజేపీ వ్యూహంగా ఉంది. కానీ ఏపీకి పెద్దగా సాయం చేయని బీజేపీని..అక్కడి ప్రజలు నమ్మడం లేదు. ఆ ప్రభావం తెలంగాణలో కూడా ఉంది.

గత ఎన్నికల్లో కూడా సీమాంధ్ర ఓటర్లు..టీఆర్ఎస్‌కు మద్ధతుగా నిలిచారు. ఆ మధ్య జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో కూడా వారు టీఆర్ఎస్ వైపే నిలబడ్డారు. ఇప్పుడు వారిని ఎలాగైనా తమ వైపుకు తిప్పుకోవాలని బీజేపీ చూస్తుందని..ఇదే క్రమంలో ఏపీకి చెందిన నేతల సపోర్ట్ తీసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పవన్ కల్యాణ్‌తో బీజేపీ పొత్తులో ఉంది..అటు కేంద్రం..జగన్‌తో సఖ్యతగా ఉంటుంది.

అలాగే చంద్రబాబుని కూడా బీజేపీ దగ్గర చేసుకుంటుందనే కథనాలు వస్తున్నాయి. అధికారికంగా ఎవరికి దగ్గరగా లేకుండా..కేంద్రంలో ఉన్న తమ అధికార బలంతో ఏపీలోని అధినేతలని తమకు మద్ధతు ఇచ్చేలా బీజేపీ రాజకీయం చేస్తుందని తెలుస్తోంది. పైగా గ్రేటర్ పరిధిలో సీమాంధ్ర నుంచి వచ్చిన వారిలో కమ్మ, రెడ్డి, కాపు ఓటర్లు ఎక్కువే. బాబు ద్వారా కమ్మ, జగన్ ద్వారా రెడ్డి, పవన్ ద్వారా కాపుల మద్ధతు పొందడమే బీజేపీ లక్ష్యమని విశ్లేషణలు వస్తున్నాయి. మరి సీమాంధ్ర ఓటర్లు బీజేపీకి ఎంతమేర మద్ధతు ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version