వాలంటీర్ల విషయంలో నెత్తిన మట్టేసుకున్న చంద్రబాబు.. పార్టీకి తీవ్రమైన నష్టం అంటున్న విశ్లేషకులు..

-

నాకు ఒక్క కన్ను పోయిన పర్లేదు.. ఎదుటివాడికి రెండు కన్నులు పోవాలనుకునే సిద్ధాంతం చంద్రబాబుది.. ఇదే స్టాటజీతో చంద్రబాబు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు.. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం, వారిపై పన్నుల భారం మోపడం చంద్రబాబు మొదటినుంచి చేస్తూనే ఉన్నారు.. అయితే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అడుగుపెట్టిన తర్వాత .. ఆయన ట్రెండ్ సెట్టర్ గా మారారు.. ప్రజలకు ఏమి అవసరం..? ఎలాంటి సంక్షేమ పథకాలు కావాలి అనే దానిపై ప్రధానంగా దృష్టి పెట్టిన జగన్.. నవరత్నాలు పథకం ద్వారా ప్రతి గడపకు వెళ్ళగలిగారు.. వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చి ఆయన ప్రజలకు గుండెచప్పుడు గా మారారు..

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో వాలంటీర్లను ఎన్నికల వ్యవహారాలకు దూరంగా పెట్టాలంటూ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఫిర్యాదులు చేస్తూనే ఉంది.. వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చినప్పటి నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యవస్థపై కక్షగట్టి మరి అసత్య ఆరోపణలు చేస్తూ వచ్చారు.. వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్, ఆడవారు ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు కొడుతున్నారు అంటూ చంద్రబాబు ఎన్నో ఆరోపణలు చేసిన వాలంటీర్లు మాత్రం ప్రజలకు సేవ చేయడంలో నిమగ్నమయ్యారు.. ప్రజలతో మమేకమై.. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చారు.. ఇది ఎల్లో బ్యాచ్ కి నచ్చలేదు.

చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉన్న నిమ్మగడ్డ ద్వారా ప్రజలకు వాలంటీర్లను దూరం చేయాలనే కుట్ర చేసి అందులో సక్సెస్ అయ్యారు.. అయితే వాలంటీర్లు పింఛన్ ఇవ్వకపోతే తాము అనేక ఇబ్బందులు పడుతాం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 66 లక్షల మంది పెన్షన్ దారులు ఆందోళనకు గురయ్యారు.. చంద్రబాబు తీరుపై తూర్పారబట్టారు.. చంద్రబాబు కుట్రవల్లే తాము ఒకటో తేదీ పెన్షన్ తీసుకోలేకపోతున్నామంటూ వృద్ధులు శాపనార్థాలు పెట్టారు.. దీంతో భయపడిన చంద్రబాబు.. తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.. ఒకటో తేదీ పెన్షన్ దారులకు పింఛన్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపణలు చేయసాగారు.. దానికి తోడు సచివాలయ వ్యవస్థ ద్వారా పింఛన్లు ఇవ్వాలంటూ సూచనలు చేశారు.. ఈ వ్యవహారం అంతా తెలుగుదేశం పార్టీకి తీవ్ర చెడ్డ పేరు తీసుకొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. చంద్రబాబుకు ఓటు వేయాలని ఒకరిద్దరు వృద్ధులు భావించినప్పటికీ.. ఈ వ్యవహారంతో వారు కూడా టిడిపికి దూరమయ్యారని ప్రచారం నడుస్తుంది.. వైసీపీకి నష్టం చేయాలని భావించిన చంద్రబాబు.. తన గోతిని తానే తవ్వుకున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version