ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు ని హీరో చేస్తారు? – జగన్ మండిపాటు?

-

 

రాష్ట్రంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో మెజారిటీ సాధించి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడించిన వైసిపి పార్టీ ప్రస్తుతం ఆ ఊపుని కొనసాగించడం ఎంతో అవసరం. ఏ సందర్భంలో కూడా ఆ పార్టీకి అవకాశం ఇవ్వకుండా ప్రజలకు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే అధికార పార్టీ ముందు ఉండే అతి పెద్ద సవాల్. మొదటి సారి అధికారం చేపట్టిన వైసిపి పార్టీ ఈ విషయంలో ఇంకా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నట్లు అనిపిస్తుంది.

 

విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి విశాఖ కేంద్రంగా ఉన్న మూడు జిల్లాల్లో వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలమైన వాతావరణం పెద్దగా కనిపించలేదు. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం. ఒకవేళ అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే అక్కడ కొత్తగా కష్టాలు వచ్చి పడతాయి ఏమోగానీ కొత్తగా అభివృద్ధి ఏమీ జరగబోదన్నది మేధావుల అభిప్రాయం.

ఇటువంటి సమయంలో చంద్రబాబు ఉత్తరాంధ్రలో నిర్వహించనున్న ప్రజా చైతన్య యాత్రను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించినప్పటికీ అతి కీలకమైన వాల్తేరు డివిజన్ ని ముక్కలు చేసింది. ఈ విషయంపై కేంద్రాన్ని ప్రశ్నించలేని వైసిపి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ కొత్త డ్రామాకు తెరలేపింది. ఇది మొత్తం ఒక నాటకమని తెలుగుదేశం పార్టీ హింట్ ఇచ్చేసి పూర్తిస్థాయిలో ఉత్తరాంధ్ర ప్రజలకు వివరించేందుకు చేపట్టనున్న ప్రజా చైతన్య యాత్రను అడ్డుకుంటే ప్రజలందరికీ ఇప్పుడు కొత్త అనుమానాలు వస్తున్నాయి.

అసలు తమ నిర్ణయం పట్ల వారికి అంత నమ్మకం ఉంటే తెలుగుదేశం పార్టీ చేపడుతున్న ఈ యాత్రను ఎందుకు అడ్డుకోవాలి? వారిని ఆపేందుకు ఎందుకు ఇంత విపరీతంగా ప్రయత్నిస్తున్నారు? రాజధాని విషయంలో వారికి సంబంధించిన ఏదైనా కుట్ర బయట పెడతారన్న భయం కాకపోతే ఇక ఏ కారణం కనిపించట్లేదు అని అంతా అనుకుంటున్నారు.

అందుకే జగన్ కూడా టిడిపి వారి ప్రయత్నాలు వారిని చేసుకోనివ్వండి గాని మీ సొంత తెలివితేటలతో వారిని అడ్డగించి ప్రజల్లో వ్యతిరేకత తీసుకొనివచ్చి లేనిపోని తలనొప్పులు తీసుకొని రావద్దంటూ హెచ్చరిస్తున్నాడు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. దానిని పడగొట్టేందుకు చూడాలి కానీ ఇలా పెంపొందించడం సరికాదని జగన్ అక్కడి ప్రాంత నేతల పై మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version