అచ్చెన్నపై బాబుది… ప్రేమతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం?

-

తెలుగుదేశం ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాఖ అధ్య‌క్ష ప‌ద‌వి అచ్చెన్నాయుడుకే ఇవ్వనున్నారని టీడీపీ అనుకూల పత్రికల్లో కథనాలు వస్తున్నాయి! ఆ పత్రికల్లో ఆ పార్టీ గురించి ఒక లీక్ వచ్చిందంటే.. అది ఆల్ మోస్ట్ ఫైనల్ అని అనుకోవచ్చు. ఈ లెక్కన చూసుకుంటే.. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్న త్వరలో భాధ్యతలు తీసుకోబోతున్నారన్నమాట. ఇంతకూ ఉన్నఫలంగ ఈ పదవి అచ్చెన్నాకు ఎందుకు ఇస్తున్నట్లు?

మొన్నటికీ నిన్నటికీ అచ్చెన్నకు కొత్తగా వచ్చిన అర్హతలు ఏమిటి? అవినీతి కేసులో అరెస్టయ్యి బెయిల్ పై బయటకు రావడం మినహా..! నిన్నమొన్నటివరకూ రామ్మోహన్ నాయుడు పేరైనా వినిపించింది కానీ… అచ్చెన్నాయుడు పేరు మచ్చుకైనా వినిపించలేదు! పైగా బాబు సీనియర్ అయిపోయారు కాబట్టి.. కాస్త యువకుడు, ఉత్సావంతుడు అయిన వ్యక్తికి ఆ బాధ్యతలు కట్టబెట్టబోతున్నారని అప్పట్లో కథనాలు వచ్చాయి. మరి ఇంతలోనే అచ్చెన్నకు ఈ పదవి ఎందుకిస్తున్నట్లు?

అచ్చెన్నకు ఆ పదవి ఇవ్వడం తప్పనీ కాదు.. ఆ పదవికి అచ్చెన్న అనర్హుడనీ కాదు.. పైగా జైలుకి కూడా వెళ్లివచ్చారాయే! కాకపోతే… ఈ పదవి ఉన్నఫలంగా అచ్చెన్నాకు ఇవ్వడంలో… అచ్చెన్నపై బాబుకు ప్రేమ కంటే భయమే ఎక్కువ కారణం అయ్యి ఉండోచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి! అచ్చెన్న అరస్టయిన కొత్తల్లో… అచ్చెన్న తెరవెనుక వ్యక్తుల పెర్లు చెబితే.. తప్పించుకునే అవకాశాలు ఉన్నాయని వైకాపా నేతలు హింట్స్ ఇస్తుండేవారు. ఈ క్రమంలో… అచ్చెన్న అవేమీ చేయకుండా ఏదోలా కిందా మీదా పడి కాలం వెళ్లదీసి, బెయిల్ పై బయటకు వచ్చారు.

ఈ క్రమంలో… ఇంటికెళ్లి మరీ అచ్చెన్నకు పలకరించిన బాబు.. కాస్త కూల్ చేసే క్రమంలో భాగంగా.. అచ్చెన్న ఆగ్రహాన్ని అణిచివేయడం కోసం ఒక పదవిని గిఫ్ట్ గా ఇస్తున్నట్లు మాట ఇచ్చి వచ్చారని అంటున్నారు! ఈ విషయంలో పెద్దల పేర్లు చెప్పకుండా ఆ కష్టమేదో తానే పడినందుకు.. అచ్చెన్న సహనానికి ఇది బాబు ఇవ్వబోయె గిఫ్ట్ అనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా వినిపిస్తున్నాయి!! ఏది ఏంఐనా… ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో బాబుకు బాగా తెలుసు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version