అప్పుడు కడప..ఇప్పుడు కుప్పం…లెవెల్ అయిందా?

-

గతంలో చేసిన పనుల ఫలితం ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు రిటర్న్ వచ్చేస్తున్నట్లు కనిపిస్తోంది. అప్పటిలో అధికారంలో ఉన్న చంద్రబాబు, ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ని ఎన్ని రకాలుగా టార్గెట్ చేశారో అందరికీ తెలిసిందే. ఆయన్ని దెబ్బకొట్టాలని నానా రకాలుగా ప్రయత్నించారు. ఆయన్ని చాలా రకాలుగా అవమానించారు. ఎగతాళి చేశారు. అలాగే ఆయన సొంత జిల్లా కడపలో, సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీకి చెక్ పెట్టడానికి తెగ ట్రై చేశారు.

అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్‌కు చెక్ పెట్టాలని చూసారు. ఆ అధికారంతోనే కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుని దక్కించుకున్నారు. టీడీపీ అధికారంలో ఉండగా కడప జిల్లాకు చెందిన స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. అప్పుడు టీడీపీ తరుపున బీటెక్ రవి, వైసీపీ నుంచి జగన్ బాబాయ్…దివంగత వైఎస్ వివేకానందరెడ్డి పోటీ చేశారు. అప్పుడు కడపలో స్థానిక సంస్థల్లో వైసీపీకే మెజారిటీ ఉంది.

అంటే ఎమ్మెల్సీ సీటు కూడా వైసీపీకే దక్కాలి. కానీ చంద్రబాబు అధికార బలాన్ని ఉపయోగించుకుని ఎమ్మెల్సీ సీటుని దక్కించుకున్నారు. అప్పుడు బీటెక్ రవి ఎమ్మెల్సీగా గెలిచారు. దీంతో జగన్ పని అయిపోయిందని టీడీపీ నేతలు విమర్శలు మొదలుపెట్టారు. అలాగే 2019 ఎన్నికల్లో కడపలో, పులివెందులలో సైతం గెలిచేస్తామని హడావిడి చేశారు.

కానీ తీరా చూస్తే సీన్ రివర్స్ అయిన విషయం తెలిసిందే. పైగా జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు ప్రతిదీ రెట్టింపుతో తిరిగొచ్చేస్తుంది. బాబుకు జగన్ చుక్కలు చూపిస్తున్నారు. అప్పుడు కడపని టార్గెట్ చేస్తే జగన్ ఏకంగా బాబు కంచుకోట కుప్పంని టార్గెట్ చేశారు. అక్కడ బాబుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పావులు కదిపారు. పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటారు. ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో వన్ సైడ్‌గా గెలిచారు. ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకుని బాబుకు షాక్ ఇచ్చారు. అంటే అన్నీ తిరిగొచ్చేశాయి. ఇక వచ్చే ఎన్నికల్లో కుప్పం బరిలో బాబుని ఓడించడమే బాబు టార్గెట్. మరి ఆ టార్గెట్ రీచ్ అవుతారో…లేక వైసీపీకి కూడా రివర్స్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version