కేంద్ర మంత్రి బండి సంజయ్ కి టీపీసీసీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్..!

-

బీజేపీ భారత జట్టు అని.. రాష్ట్రంలో ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీది పాకిస్తాన్ క్రికెట్ టీమ్ అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో బండి సంజయ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల వచ్చాయనే ఓట్ల కోసం బండి మరోసారి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలను క్రికెట్ తో ముడిపెట్టడం కేవలం బీజేపీ నాయకులకే చెల్లిందని ఫైర్ అయ్యారు.

ఇండియా గెలిస్తే.. బీజేపీ గెలిచినట్టే అన్నట్టుగా బండి సంజయ్ మాట్లాడటం దురదృష్టకరమని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపించిన వేళ కేంద్రప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవీలో ఉండి బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఎప్పటిమాదిరిగానే కేవలం ఎన్నికల సమయంలోనే కమలనాథులకు హిందుత్వ నినాదం గుర్తుకు వస్తుందని సెటైర్లు వేశారు. పన్నుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు ఏనాడైనా మాట్లాడారా..? అని ప్రశ్నించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version