రేపు, ఎల్లుండి నన్ను అరెస్టు అయిన చేయొచ్చు : చంద్రబాబు

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసులు ఇవ్వడం ఏపీలో దుమారం రేపుతోంది. దీనిపై తాజాగా ఏపీ సీఐడీ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో.. తాజాగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అనంతపురం జిల్లా రాయదుర్గంలో పల్లె ప్రగతికోసం ప్రజావేదిక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ” రేపో, ఎల్లుండో నన్ను అరెస్టు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అరాచకాలపై నేను పోరాటం సాగిస్తున్నా. అందుకే నన్ను అరెస్టు చేస్తారోమో అంటూ చంద్రబాబు అన్నారు.

45ఏళ్లు నిప్పులా బతికా. నేను ఏ తప్పూ చేయలేదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ విధ్వంస పాలనను ప్రజలు చూస్తూనే ఉన్నారు. జగన్.. సైకో మాత్రమే కాదు.. కరడుగట్టిన సైకో అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రైతులకుకూడా చెప్పకుండా భూముల్లో కాల్వలు తవ్వుతున్నారు. తప్పులను ప్రశ్నిస్తే అడ్డుకునే పరిస్థితి ఉంది” అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

” రేపు, ఎల్లుండి నన్ను అరెస్టు అయిన చేయొచ్చు. అలాకాకుంటే దాడి అయినా తనపై చేయవచ్చు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పని అయినా చేశారా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. అంగళ్లు, పుంగనూరులో వైసీపీ నాయకులు నాపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. హత్యాయత్నం చేసి తిరిగి తనపైనే కేసులు పెట్టారు. నేను చెబితేనే దాడులు చేసినట్లు ఒత్తిడి చేస్తూ స్టేట్మెంట్ రాయిస్తున్నారు” అంటూచంద్రబాబు ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version