విపక్షాలది ఇండియా కూటమి కాదు.. ఇటలీ ఇండియా కూటమి : బండి సంజయ్‌

-

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అయితే.. తాజాగా ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. నిఖార్సైన హిందువునని చెప్పుకునే కేసీఆర్ తమిళ మంత్రి వ్యాఖ్యలపై ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. విపక్షాలది ఇండియా కూటమి కాదని, ఇటలీ ఇండియా కూటమి అని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. రాహుల్ గాంధీ, ఉదయనిధి చెబితే వినాల్సిన ఖర్మ దేశ ప్రజలకు లేదన్నారు బండి సంజయ్.

సనాతన ధర్మం జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బండి సంజయ్ హెచ్చరించారు. సనాతన ధర్మాన్ని అంతమొందించాలని ప్రయత్నించినవాళ్లు సమాధుల్లో ఉన్నారన్నారు. ఔరంగజేబు మొదలు బ్రిటిష్ వాళ్ల వరకు కనుమరుగయ్యారన్నారు. నుపుర్ శర్మ, రాజాసింగ్‌లను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే చంకలు గుద్దుకున్న పార్టీలు ఇప్పుడు మాట్లాడటం లేదన్నారు బండి సంజయ్. గతంలో ఉదయనిధి తాత కరుణానిధి ‘రాముడు ఇంజనీరా?’ అని మాట్లాడారని, ఇప్పుడు మనవడు సనాతర ధర్మాన్ని అంతమొందిస్తానని అంటున్నాడని బండి సంజయ్ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version