ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అంటూ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న తెలిసిందే. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పోరాటాన్ని కాస్త తీవ్రంగానే చేస్తున్న సంగతి తెలిసిందే. రాజధానిగా అమరావతిని కొనసాగించడంతో పాటుగా ఆ ప్రాంత రైతులకు ప్రభుత్వం అన్యాయం చేయవద్దని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఆయన అమరావతి పరిరక్షణ సమితి నేతలతో కలిసి అమరావతి ఉద్యమం కోసం మచిలీపట్నంలో చంద్రబాబు జోలె పట్టి విరాళాలు సేకరించారు. దీనికి అక్కడి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఆ కార్యక్రమం అనంతరం చంద్రబాబు బహిరంగ సభలో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించిన ఆయన, పవన్ కల్యాణ్ పోరాటాలు చేసి పైకి వచ్చిన వ్యక్తి అన్నారు.
పవన్ కల్యాణ్‌ను పవన్ నాయుడు అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్న ఆయన, మంత్రి కొడాలి నానీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు. మంత్రి కొడాలి నాని.. నాని రెడ్డా, నాని జోసెఫో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. పవన్ పోరాటాలు చేసి పైకి వచ్చారని.. వైసీపీ నేతలు దోపిడీలు చేసి పైకి వచ్చారని అన్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఆఫీస్ ని చంద్రబాబు బుధవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే.