రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి జరగాలంటే.. మూడు రాజధానులు ఉండాలని అసెంబ్లీలోనే చూచాయగా వె ల్లడించిన సీఎం జగన్ ఆదిశగా దూసుకుపోతున్నారా? ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఎన్ని అ వాంతరాలు వచ్చినా చేసి చూపించాలనే గట్టి పట్టుదలతో ఉన్నారా? అంటే.. తాజా పరిణామాలు ఔననే అం టున్నాయి. వైసీపీ నాయకులు కూడా మూడు రాజధానులకే మొగ్గు చూపుతూ.. అన్ని ప్రాంతాల్లోనూ స్పం దిస్తున్నారు. ఒకపక్క రైతులను ఊరడిస్తూనే.. మరోపక్క, విపక్షాలపై దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో వైసీపీ ఎట్టి పరిస్తితిలోనూ తన నిర్ణయం నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి వేసే పరిస్థితి లేదని స్పష్టంగా తెలుస్తోంది.
రాజధానుల మార్పు లేదా మూడు రాజధానుల నిర్ణయంపై జగన్ దాదాపు ఆరు మాసాలకు ముందు నుం చే పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నారనే విషయం వాస్తవం. ఈవిషయంలో ఆయనను బీజేపీ, టీడీపీ బెదిరిస్తున్నట్టు కేంద్రం చూస్తూ ఊరుకోదు.. అనే వ్యాఖ్యలపై జగన్ ముందుగానే దృష్టి సారించారి కూడా తాజాగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నారు. తాను సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఢిల్లీలో ప్రధాని మో డీ, బీజేపీ సారధి అమిత్ షాలతో పలుమార్లు భేటీ అయ్యారు. ఈ క్రమంలో నే జగన్ వారికి రాజధానుల వి షయాన్ని వెల్లడించడంతోపాటు.. వారి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ పొందారని తాజాగా ఢిల్లీలో బీజేపీ పెద్ద లే చెప్పుకోవడం సంచలనంగా మారింది.
అదే సమయంలో వ్యూహాత్మకంగా తమ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా అమరావతిని వద్దనలేదనే విషయా న్ని కూడా సాంకేతికంగా ప్రజల ముందు న్యాయ వ్యవస్థ ముందు కూడా ఉంచేందుకు జగన్ పక్కాగా ప్ర యత్నించారు. ఈ క్రమంలోనే రెండు కమిటీలను నియమించడంతోపాటు ఈ నివేదికలను అధ్యయనం చేసేందుకు హైపవర్ కమిటీని కూడా నియమించారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తూ.. ఎవరు ఎన్ని ఆందో ళనలను చేసినా కూడా జగన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికే కట్టుబడి ఉన్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. మూడు రాజధానుల ప్రతిపాదన, అమలు విషయంలో వైసీపీప్రభుత్వం ఇక వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు పరిశీలకులు.