ఇటివలే కన్నుమూసిన గద్దర్‌ను భయం అంటే ఏంటో తెలియని వ్యక్తిగా టీడీపీ అధినేత చంద్రబాబు అభివర్ణించారు. మంగళవారం గద్దర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1997లో గద్దర్‌పై కాల్పులు జరిగిన ఘటనపై స్పందించారు. కాల్పుల ఘటనకు సంబంధించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యాన్ని‘మా భూమి’పేరుతో సినిమా తీశారు నిర్మాత నర్సింగరావు. ఆ సినిమాలో ఉద్యమకారుడి పాత్రలో గద్దర్ నటించారు. చిత్రంలోని‘బండెనకబండి కట్టి పదహారెడ్ల బండి కట్టి ఏ బండ్లె వస్తవ్ కొడకా నైజాము సర్కరోడా’అనే పాట పాపులర్ అయ్యంది. ఆ సినిమా పాటను చూసే గద్దర్ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నట్టు భావించి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా దాదాపు పదేళ్లపాటు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించిన చంద్రబాబుకు తెలంగాణ సాయుధ పోరాటంపై అవగాహన లేకపోవడం గమనార్హం.