“జగన్ కి తిక్కుంది .. దానికో లెక్కుంది ” బాబు నోట్లోంచి ఈ మాటలు ??

-

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మూడు రాజధానులు వద్దు రాజధాని అమరావతి లో నే ఉంచాలని గత 50 రోజులకు పైగానే అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు నిరసనలు చేసిన విషయం అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో సి ఆర్ డి ఎ మరియు వికేంద్రీకరణ బిల్లులను శాసనమండలిలో టీడీపీ అడ్డుకున్న సంగతి కూడా మనందరం చూసాము. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం మూడు నెలలు మాత్రమే మూడు రాజధానుల కాన్సెప్ట్ టిడిపి అడ్డుకోగలరు తరువాత ఆ బిల్లులను ఎవరు ఆపలేరు అంటూ వైసీపీ నేతలు ఇటీవల కామెంట్ చేయడం జరిగింది.

దీంతో ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో కౌంటర్ వేశారు. మూడు రాజధానుల విషయంలో దూకుడుగా వెళ్తున్న వైసీపీ నేతల పై మరియు జగన్ పై ఫుల్ సీరియస్ అయ్యారు. అమరావతిని రెఫరెండం గా పెట్టాలని జనం ఏం కోరుకుంటున్నారో తెలుస్తుందని తేలిపోతుందని రెఫరెండంలో ప్రజలు కనుక 3 రాజధానులకు మద్దతిస్తే నేనిక మళ్లీ మూడు రాజధానుల పై నోరెత్తను అని స్పష్టం చేశారు. అంతగా విర్రవీగుతున్న జగన్ ప్రభుత్వానికి నేను అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా ఇస్తానని చంద్రబాబు ఫుల్ సీరియస్ అయ్యారు.

జగన్ పరిపాలన సైకో పరిపాలన లాగా ఉందని… ” జగన్ కి తిక్కుంది .. దానికో లెక్కుంది ” అన్నట్టుగా చంద్రబాబు ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. మా హయాంలో నిర్మొహమాటంగా పాదయాత్రలు దీక్షలు ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ జగన్ కి ఇస్తే…ఇప్పుడు అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version