నేడు గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన…

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా గురు, శుక్ర, శని వారాల్లో గుంటూరు, బాపట్లలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు పెదకాకాని, నారాకోడూరు, పొన్నూరులో పర్యటన ఉంటుంది. నారాకోడూరులో రైతులతో సమావేశం అవనున్నారు. రాత్రి పొన్నూరులో బస చేయనున్నారు. శుక్రవారం ముస్లింలతో సమావేశం అవుతారు. అనంతరం బాపట్ల జిల్లాలో చుండూరుపల్లి, అప్పికట్ల గ్రామాల్లో ప్రజలతో మాట్లాడతారు. రాత్రి బాపట్ల ఇంజనీరింగ్‌ కళాశాలలో బస చేస్తారు. శనివారం అదే కళాశాలలో ఎస్‌సి విద్యార్థులు, మహిళలతో విడివిడిగా ముచ్చటించనున్నారు. టీడీపీ బిసిల గుండెల్లో ఉంటుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. టీడీపీ డిఎన్‌ఎ బిసిలు అని బుధవారం తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జయహోబిసి స్లోగన్‌ టిడిపిదేనని తెలిపారు. టిడిపి మాజీమంత్రి ఎమ్మెల్సీ వివివి చౌదరి రూపొందించిన పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు.

చంద్రబాబు పాల్గొనే కార్యక్రమాలను జయప్రదం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. జిల్లా పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి పట్టిన ఖర్మ పోవాలంటే.. ప్రజలందరూ చంద్రబాబుకు మద్దతు పలకాలని కోరుతున్నారు. ఈనెల 8న పొన్నూరు, 9న చీరాల, 10న బాపట్ల నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన ఉండనుంది. దీంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు చంద్రబాబు పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విజయవంతం చేసేలా ఏర్పాట్లు చేశారు. బైక్ ర్యాలీలు, రోడ్ షో, బహిరంగ సభలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version