ఎవర్నీ వదల్లేదు ..! అందరినీ ‘ఇరికించిన ‘  బాబు ?

-

వాత అనుకోవాలో ముందుచూపు అనుకోవాలో తెలియదు కానీ, టిడిపి అధినేత చంద్రబాబు ఒక భారీ జంబో జెట్ ను ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో పోరాటం చేయాల్సి ఉన్న తరుణంలో, పార్టీ నాయకులు అందరిలోనూ ఉత్సాహం నింపే విధంగా రాష్ట్ర కమిటీలో పెద్ద ఎత్తున నాయకులకు చోటు కల్పించారు. కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో పదవులు భర్తీ జరిగింది. పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్చార్జి లతోపాటు,  మంత్రులు, ఇలా చాలామంది తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇక పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకుల్లోనూ, అసంతృప్తి రేగింది. తాజాగా ప్రకటించిన కమిటీ లో టిడిపి లో కీలకమైన నాయకులందరికీ చోటు కల్పించడం తో పాటు, యువ నాయకులకు ఎక్కువగా ప్రాధాన్యం కల్పించారు.
ప్రస్తుతం టిడిపి రాష్ట్ర కమిటీ లో సుమారు 219 వరకు సభ్యులకు ఉన్నారు. అంటే ఏపీ శాసన సభ్యుల సంఖ్య కంటే, ఈ సంఖ్య బాగా ఎక్కువ. ఇప్పుడు ఈ జెంబో కమిటీతో టిడిపిలో తమకు ప్రాధాన్యం లేదని అసంతృప్తికి గురయ్యే వారి సంఖ్య దాదాపుగా తగ్గిపోతుందని బాబు భావిస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లో యక్టివ్ అవ్వాల వద్దా అనే విషయంలో క్లారిటీ లేని వారికి , పార్టీ మారే ఆలోచనలో ఉన్న వారికి ఇప్పుడు ఈ కమిటీల ద్వారా బాబు క్లారిటీ ఇచ్చారు.  ఇప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా, కమిటీ లోకి తీసుకున్నారు కాబట్టి,  తప్పనిసరిగా పార్టీ కోసం కదన రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ఈ కమిటీల్లో సామాజిక వర్గాల సమతూకం సైతం పాటించినట్లు కనిపిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితమే వైసిపి ప్రభుత్వం పెద్ద ఎత్తున బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి,  దాదాపు అన్ని కులాలకు కార్పొరేషన్ చైర్మన్ , డైరెక్టర్లను నియమించారు. దీంతో బీసీ ల్లోనూ, వైసీపీ పై మరింత ఆదరణ పెరిగింది. టిడిపి ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న బీసీలు ఒక్కసారిగా దూరమవడం, రానున్న రోజుల్లో వీరి అవసరం టిడిపికి ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో ముందుచూపుతో బాబు ఈ కొత్త కమిటీలను ఏర్పాటు చేసినట్టు గా కనిపిస్తున్నారు.వారిలో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో కమిటీల పేరుతో అందర్నీ ఈ విధంగా బాబు లాక్ చేసినట్టుగా కనిపిస్తున్నారు.
టిడిపి పై అసంతృప్తితో ఉన్న నాయకులకు ఈ కమిటీల్లో పదవులు ఇవ్వడం ద్వారా, బాబు సరికొత్త రాజకీయానికి తెర తీసినట్లు గా కనిపిస్తున్నారు. బాబు రాజకీయం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాల్సిందే. అయితే ఈ కమిటీల్లో ప్రజాబలం ఉన్న నాయకులు సంఖ్య తక్కువగా ఉన్నట్టుగానే కనిపిస్తున్నా , ఎక్కువగా లోకేష్ కు సన్నిహితంగా ఉండే వారికే ప్రాధాన్యం దక్కినట్టు గా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version