ఇవాళ టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు కుప్పం లో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా కుప్పంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సభలో ఉద్రిక్తత నెలకొంది. బాంబు తెచ్చడాని ఓ వ్యక్తిని టిడిపి కార్యకర్తలు పట్టుకున్నారు. అనంతరం ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు టిడిపి కార్యకర్తలు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ నేతలు బాంబులు వేసినా భయపడేది లేదని జగన్ కు వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.
టిడిపి మళ్ళీ అధికారంలోకి వస్తుందని.. టిడిపి అధికారంలోకి రాగామే కమిషన్ వేస్తామన్నారు. తీవ్రవాదులు, ముఠా నాయకులకు భయపడేది లేదని.. మిమ్మల్మీ ఆర్ధికంగా,మానసికంగా వేదిస్తున్నారని పేర్కొన్నారు చంద్రబాబు. పోలీసులతో అక్రమ కేసుల పెట్టిస్తున్నారని.. మున్సిపల్ ఎన్నికలలో ఇలాంటి కుట్ర రాజకీయాలనే చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి, ప్రశాంతత కావాలంటే టిడిపిని మున్సిపల్ ఎన్నికలలో గెలిపించాలని కోరారు. కుప్పంలోకి రౌడీలు, గూండాలు ప్రవేశించారని.. ఓటు వేయకపోతే రేషన్,అమ్మ ఓడి,పెన్షన్ కట్ చేస్తామని వైకాపా నేతలు బెదిరిస్తున్నారని నిప్పులు చెరిగారు.