మ‌రోసారి లేటుగా రియాక్ట్ అయిన చంద్ర‌బాబు.. వైసీపీ విమ‌ర్శ‌లు

-

మ‌హానేత‌, విశ్వ‌విఖ్యాత సార్వభౌమ అయిన‌టువంటి నంద‌మూరి తార‌క‌రామారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌నే డిమాండ్ ఎప్ప‌టి నుంచో ఉంది. అయితే రీసెంట్ గా ఆయ‌న జ‌యంతి నాడు మ‌ళ్లీ ఆ టాపిక్ తెర‌మీద‌కు వ‌చ్చింది. మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాలంటూ కోర‌డంతో… అదే రోజు మ‌హానాడులో చంద్ర‌బాబు దీనిపై తీర్మానం చేశారు.

 

అయితే గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు దీనిపై కృషి చేయ‌కుండా.. ఇప్పుడు అన‌డం ఏంట‌ని అంతా ప్ర‌శ్నిస్తున్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు దీనిపై దృష్టి పెట్టిన‌ట్ట‌యితే ఇప్ప‌టికే రామారావుకు భార‌త‌ర‌త్న వ‌చ్చి ఉండేద‌ని అంతా అంటున్నారు.

ఇక ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై విజ‌య‌సాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్ర‌బాబు నాయుడు గ‌తంలో తాను చక్రం తిప్పినన్ని రోజులు పట్టించుకోకుండా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఇప్పుడు తీర్మానం చేయడం ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు అంటూ సెటైర్లు వేశారు. ఇక బీజేపీతో క‌లిసి ప‌నిచేయ‌డానికి టీడీపీ రెడీ ఉన్నా.. బీజేపీ లేదంటూ కౌంట‌ర్ వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version