ముఖ్యమంత్రి జగన్ కు నారా చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. బలహీన వర్గాలను సామాజికంగా ఆర్ధికంగా ప్రభుత్వాలు ప్రోత్సహించాలని.. రెండేళ్లుగా బీసీల సామాజిక, ఆర్ధిక అభివృద్ధి ప్రశ్నార్ధకమైందని ప్రశ్నించారు. అనాదిగా కుల వృత్తులపై ఆధారపడిన వారి ఎదుగుదల దెబ్బతిన్నదని… రిజర్వేషన్లను కుదించి స్థానిక సంస్థలలో 16,800 మందికి పదవులు దూరం చేశారని ఫైర్ అయ్యారు.
రెండేళ్లలో కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా రూపాయి రుణం ఇవ్వలేదని… స్వయం ఉపాధి అవకాశాలూ కల్పించలేదని నిలదీశారు. గతంలో మత్స్యకారులకు సబ్సిడీతో వలలు, పడవలు వచ్చేవని.. కానీ రెండేళ్లుగా మత్స్యకారులకు సబ్సిడీ పథకాలు దూరం చేశారని ఫైర్ అయ్యారు.
సముద్రంలో చనిపోయిన వారికి డెత్ సర్టిఫికెట్లూ ఇవ్వడంలేదని… జీవో నెం.217తో మత్స్యకారులకు ఉరి వేసే ప్రయత్నమని మండిపడ్డారు. సొసైటీల చేతుల్లో ఉండాల్సిన వనరుల్ని వ్యక్తుల చేతుల్లో పెట్టడం సరికాదని.. ప్రభుత్వ ఉత్వర్వులతో మత్స్యకారులు ఆర్ధికంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెం.217 అమలైతే మత్స్యకార సొసైటీలను నిర్వీర్యమ వుతుందన్నారు.