ఆసక్తి రేపుతున్న ‘చంద్రముఖి-2’ ట్రైలర్‌

-

లాఘ‌వ లారెన్స్‌ న‌టిస్తున్న సినిమా చంద్రముఖి 2 . ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టి కంగ‌నా రనౌత్ హీరోయిన్‌. పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో వడివేలు, మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సృష్టి డాంగే, రావు రమేష్, విఘ్నేష్, రవి మారియా, సురేష్ మీనన్, సుభిక్ష కృష్ణన్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఎంఎం కీర‌వాణి సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 19న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప‌నులు పూర్తి చేసుకుంటుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మేక‌ర్స్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ”చంద్రముఖి సినిమా చివర్లో భవనం నుంచి బయటికి వెళ్లే పాముతోనే చంద్రముఖి-2 ట్రైలర్ మొదలుకాగా.. రాజాధిరాజా.. రాజా గంభీర.. రాజా మార్తాండ.. వెట్టయ్య రాజా వస్తున్నాడు అంటూ ట్రైల‌ర్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అల‌రిస్తుంది. ఇక ఈ ట్రైల‌ర్‌లో వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమ నంబియర్, రాధికా, రావు రమేష్‌లు కనిపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version