హైదరాబాద్- యాదాద్రి రైల్వే లైన్ మంజూరు చేశాం : కిషన్‌ రెడ్డి

-

2014 కు ముందు తెలంగాణ ప్రాంతంలో కేవలం 17 కి.మీల రైల్వే లేన్ మాత్రమే నిర్మాణం జరిగిందని.. మోదీ ప్రభుత్వం వచ్చాక 55 కి.మీల రైల్వే నిర్మాణం ప్రతి యేటా జరుగుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి వలంటి 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరించి ఆదర్శ స్టేషన్లుగా తీర్చిదిద్దామని తేతలిపారు మన్తర్తి కిషన్ రెడ్డి. ఎంఎంటీఎస్ ఫేజ్ 2, కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ కు రూ.521 కోట్లు మంజూరు చేసిందన్నారు ఆయన . తెలంగాణలో రైల్వే కనెక్టివిటీకి కృషి చేస్తున్నామన్నారు బీజేపీ నేత కిషన్ రెడ్డి.

రైల్వే కనెక్టివిటీ కోసం 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేశామన్నారు మంత్రి కిషన్ రెడ్డి . వీటితో రైల్వే కనెక్టివిటీకి చర్యలు తీసుకుంటామన్నారు. 13 వందల కిలోమీటర్లు రైల్వే లైన్లకోసం భూసేకరణ చేస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు . రైల్వే విస్తరణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎంఎం టీఎస్, ఇతర రైల్వే విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. రైల్వే కనెక్టివిటీలో భాగంగా హైదరాబాద్- యాదాద్రి లైన్ మంజూరు చేశామని తెలిపారు.

ప్రతి యేటా 55 కిలోమీటర్లు రైల్వే లైన్ వేస్తున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని మోదీ స్వంయంగా ఎంఎం టీఎస్ సెకండ్ ఫేజ్ ప్రారంభించారని కిషన్ రెడ్డి తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ ఏర్పాటు చేయనున్న ఔటర్ రింగ్ రైల్ ను రూ.12,408 నిర్మించాలని కేంద్రం ప్రాజెక్టును చేపడుతోందని.. దీనికి కావాల్సిన భూసేకరణకు రాష్ర్టప్రభుత్వం ముందుకు రావడంలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. దీంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version