Big Breaking : చరిత్ర సృష్టించిన భారత్‌.. చంద్రయాన్‌-3 విజయవంతం..

-

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చంద్రయాన్‌-3 విజయవంతమైంది. జాబిల్లిపై చంద్రయాన్‌-3 విజయవంతంగా ల్యాండ్‌ అయ్యింది. ఎంతో కీలకమైన వర్టికల్‌గా విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లిపై అడుగుపెట్టింది. చంద్రుడిపై చంద్రయాన్‌-3 ల్యాండ్‌ అయ్యే దృశ్యాలు బెంగళూరు నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని అందించారు ఇస్రో అధికారులు.. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ సైతం వీక్షించారు. ప్రపంచా వ్యాప్తంగా ఉన్న భారతీయులే కాకుండా.. అందరూ చంద్రయాన్‌-3పై ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

 

అయితే.. చంద్రయాన్‌ -3 జాబిల్లిపై ల్యాండ్‌ అయ్యే కీలక 17 నిమిషాల ప్రక్రియలను ఇస్రో సైంటిస్టు నిశితంగా పరిశీలించారు. ముందుగా.. చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి క్షణం క్షణం ఉత్కంఠ పరిస్థితిని అంచనా వేశారు అధికారులు. ల్యాండర్‌ నుంచి వస్తున్న సిగ్నల్స్‌ను క్షుణ్ణంగా అధికారులు పరిశీలిస్తున్నారు. చంద్రుడి దక్షిణధృవంపై చంద్రయాన్‌-3 విజయవంతంగా ల్యాండ్‌ కావడంతో అందరూ ఎంతో సంతోషంతో కరతాళధ్వనలతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. చంద్రయాన్‌-3 జాబిల్లి దక్షిణధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా ఇండియా అవతరించింది. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణంగా అభివర్ణించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version