చిరిగిపోయిన నోట్లను, తడిసిన నోట్లని ఎలా మార్చుకోవచ్చో తెలుసా..?

-

మనం ఏదైనా కొనాలన్నా ఏదైనా చెయ్యాలన్నా డబ్బులు చాలా అవసరం. అయితే కరెన్సీ నోట్ల విషయంలో చాలా మందికి ఎన్నో సందేహాలు వుంటుంటాయి. అసలు చిరిగిన నోట్లు చెల్లుతాయా…? లేదంటే పాడైపోయినవి తడిసిపోయినవి చెల్లుతాయా..?

ఈ విషయానికి వస్తే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం అంటోంది అనేది చూసేద్దాం. మహాత్మా గాంధీ శ్రేణితో సహా, వ్రాసిన లేదా వేరే రంగులో ఉన్న నోట్లు ఏవైనా సరే అంకెలు క్లియర్ గా ఉంటే ఏ బ్యాంక్ కూడా నిరాకరించదు. ఆ నోట్లను ఏదైనా బ్యాంకు శాఖ లో అయినా సరే డిపాజిట్ చేయవచ్చు. అలానే మార్చచ్చు కూడా. కానీ రాజకీయ లేదా మతపరమైన సందేశాలు ఉంటే అప్పుడు అవి చెల్లవు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్, 2009 ప్రకారం నోట్లకు సంబంధించి అలాంటి క్లెయిమ్‌ను బ్యాంక్ రద్దు చేస్తుంది. మ్యుటిలేట్ చేసిన నోట్లను కూడా మార్చచ్చు. సర్క్యులర్లను ఎప్పటికప్పుడు రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తూనే ఉంటుంది. ఏదైనా బ్యాంకు శాఖలో లేదా రిజర్వ్ బ్యాంక్ కార్యాలయంలో నోట్ల ని మారచ్చు. ఒకసారి కేవలం గరిష్టంగా 20 నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు. వీటి విలువ రూ.5000 మించకూడదు. కాలిపోయిన, మ్యుటిలేటెడ్ నోట్లను కేవలం రిజర్వ్ బ్యాంక్ కార్యాలయంలోనే డిపాజిట్ చెయ్యచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version