దామోదర రాజనర్సింహా….తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు. దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్‌లో పని చేస్తున్న నాయకుడు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేత. కాంగ్రెస్ పార్టీ తరుపున 1989లో తొలిసారి ఆందోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఆ తర్వాత వరుసగా ఓడిపోతూ వచ్చిన రాజనర్సింహా, 2004, 2009 ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ తరుపున గెలిచారు.
అయితే ఇప్పుడుప్పుడే ఆందోల్ రాజకీయాలు మారుతున్నాయి. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌పై వ్యతిరేకత పెరుగుతుండగా, కాంగ్రెస్ నిదానంగా పుంజుకుంటుంది. పైగా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాక రాజకీయాలు మరింతగా మారాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా దామోదర రాజనర్సింహ సైతం దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి సపోర్ట్‌గా ఉంటే పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు.
ఇటు వచ్చే ఎన్నికల్లో ఆందోల్‌లో గెలవాలని దామోదర గట్టిగానే కష్టపడుతున్నారు. ఇప్పుడు అక్కడ టీఆర్ఎస్ తరుపున క్రాంతి కిరణ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే బిజేపి తరుపున బాబూమోహన్ పనిచేస్తున్నారు. బాబూమోహన్‌కు కూడా ఆందోల్‌పై మంచి పట్టు ఉంది. పైగా బిజేపి కూడా రాష్ట్రంలో పుంజుకుంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆందోల్‌లో దామోదరకు గెలిచే ఛాన్స్ ఉంటుందో లేదో చెప్పలేని పరిస్తితి ఉంది. కాకపోతే ఎన్నికలనాటికి కాంగ్రెస్ ఇంకా పుంజుకుంటే దామోదరకు గెలుపు అసాధ్యం కాకపోవచ్చు.