అఖిల్ సురేందర్ సినిమా వెనుక ఆ హీరో ఉన్నాడా…?

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిగతా హీరోలతో పోలిస్తే అఖిల్ భిన్నమనే చెప్పాలి. ఆరు నెలల వయస్సులోనే సిసింద్రీ సినిమాలో నటించి అభిమానులను సొంతం చేసుకున్నారు అఖిల్. దీంతో అఖిల్ తొలి సినిమాకు ముందే ఈ యువ హీరోపై భారీ అంచనాలు పెరిగాయి. నాగచైతన్యతో పోలిస్తే సినిమాల్లో బెటర్ గా రాణిస్తాడని అభిమానులు భావించారు. కట్ చేస్తే అఖిల్ నటించిన తొలి మూడు సినిమాలు ఒకదానిని మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి.

హిట్ ట్రాక్ లో ఉన్న దర్శకులే అఖిల్ తో సినిమాలు తీసినా అఖిల్ ను మాత్రం హిట్ ట్రాక్ ఎక్కించలేకపోయారు. అఖిల్ తొలి సినిమాకు మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వం వహించగా రెండో సినిమాకు విక్రమ్ కె కుమార్, మూడో సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. డిజాస్టర్ అనిపించుకున్న అఖిల్ చిత్రానికి 20 కోట్ల రూపాయల షేర్ రాగా ఆ తరువాత సినిమాలకు అంతకంటే తక్కువ షేర్ రావడం గమనార్హం.

ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్నాడు. వరుస ఫ్లాపుల్లో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అయితే తాజా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటించబోతున్నాడని తెలిసి అఖిల్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే అఖిల్ కెరీర్ ను సెట్ చేసే బాధ్యతను రామ్ చరణ్ తీసుకుని ఈ ప్రాజెక్ట్ సెట్ చేసినట్లు తెలుస్తోంది.

ధ్రువ, సైరా విజయాలతో దూకుడు మీదున్న సురేందర్ రెడ్డిని రామ్ చరణ్ అఖిల్ తో సినిమా చేయాలని కోరాడని… బాగా క్లోజ్ అయిన చరణ్ కోరడం సురేందర్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఒక పెద్ద హీరోతో తరువాత సినిమాను చేయాలనుకున్న సురేందర్ రెడ్డి రామ్ చరణ్ వల్ల అఖిల్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథ అందించనుండగా స్పై థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version