చిరంజీవిపై పెట్టిన ఆ చెత్త పోస్టింగ్ లు నావి కావు: ఎమ్మెల్యే చెవిరెడ్డి

-

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, చిరంజీవి భేటిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, ఆ పార్టీ కీలక నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పేరిటి ఫేస్‌బుక్‌ లో పెట్టిన పోస్ట్‌ దుమారాన్ని రేపింది. అయితే ప్రముఖ నటుడు చిరంజీవితో తనకు ఏ విధమైన విభేదాలూ లేవని చంద్రగిరి ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తన ప్యాన్స్ గా చెప్పుకుంటున్న కొందరు చిరంజీవిపై చేస్తున్న తప్పుడు ప్రచారం వెనుక తనకు ఎటువంటి సంబంధాలూ లేవని ఆయన అన్నారు.

తిరుపతిలో ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన.. తనకు సొంతంగా ట్విట్టర్‌ కాని, ఫేస్‌బుక్‌ అక్కౌంట్లుగాని లేవని స్పష్టం చేశారు. చిరంజీవిపై పెట్టిన పోస్టింగ్ లను ఖండిస్తున్నానని, ఈ మొత్తం పోస్టింగ్ ల వెనుక తెలుగుదేశం పార్టీ నాయకుల కుట్ర దాగుందని ఆరోపించారు. జగన్, చిరంజీవి మధ్య సంత్సబంధాలు ఉండకూడదన్న కుట్రతోనే ఇలా చేశార‌ని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే తన ఫ్యాన్స్ అసోసియేషన్ పేరిట సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పోస్టింగ్స్ ను తక్షణం తొలగించాలని పోలీసులను కోరినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version