సైదాబాద్ లో చీకోటి ప్రవీణ్ ఇంటి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు పహారా కాస్తున్నారు.ఉదయం నుండి ఇంటి సమీపంలో తిష్ట వేశారు దుండగులు. దీంతో బిల్డింగ్ చుట్టు అప్రమత్తం అయ్యారు చికోటి ప్రవీణ్ సెక్యురిటి సిబ్బంది. సీసీటీవి కెమెరాల ద్వారా వ్యక్తులను పరిశీలిస్తున్నారు కుటుంబ సభ్యులు.సోమవారం ED ముందు హాజరు కానున్నారు ప్రవీణ్ చికోటి, మాధవ రెడ్డి.
రాజకీయ నాయకులతో సంబంధాలు బయటపెటానున్నారు ప్రవీణ్. ఈ నేపథ్యంలో ప్రవీణ్ ఇంటి చుట్టూ గుర్తుతెలియని వ్యక్తులు పహారా కాయడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. చికోటి ప్రవీణ్ కు ప్రాణహాని ఉందంటు కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే..చికోటి ప్రవీణ్, సంపత్ ఆర్థిక లావాదేవీలను ఈడి అధికారులు పరిశీలించారు. తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నేతలకు చీకోటి ప్రవీణ్ బినామీగా ఉన్నట్లు ఈడి అధికారులు అనుమానిస్తున్నారు. కోట్ల రూపాయలు హవాలా ద్వారా లావాదేవీలు జరిగినట్లు ఈడి అధికారులు గుర్తించారు.
కమిషన్ల రూపంలో చీకోటి ప్రవీణ్ కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు గుర్తించారు. నేపాల్ శ్రీలంక థాయిలాండ్ ఇండోనేషియా లో 7 క్యాసినో క్యాంపులు ఏర్పాటు చేసినట్లు ఆధారాలు సేకరించారు. సోమవారం చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి, సంపత్ లను ఈడి అధికారులు మరోసారి ప్రశ్నించనున్నారు.