ఇంగ్లీష్ మీడియం లేకపోతే పిల్లలకు భవిష్యత్తు ఉండదు – సీఎం జగన్

-

నేడు విశాఖ జిల్లాలో పర్యటించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్ సంస్థ 1.62 మందికి శిక్షణ ఇస్తుందన్నారు. సుమారు 36 వేల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు. మైక్రోసాఫ్ట్ సంస్థ ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. 40 రకాల కోర్సుల్లో మైక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ఇచ్చిందన్నారు.

దీనికి ఒక్కరికి 30 వేల ఖర్చు ఆవుతుందని.. లక్ష 62 వేల మందికి 465 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఈ మొత్తం ఖర్చు ప్రభుత్వం భరిస్తోందన్నారు. విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామన్నారు సీఎం జగన్. దేశంలో మొదటి సారిగా మైక్రోసాఫ్ట్ సంస్థ మన విద్యార్థులకు శిక్షణ ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థి చదువుకోవాలని.. చదువుకుంటేనే పేదరికం నుంచి బయట పడతారని అన్నారు.

బ్రిక్స్ దేశాలతో పోల్సితే మనదేశంలో 26 శాతం మంది మాత్రమే చదువుతున్నారని అన్నారు. ఇంగ్లీష్ మీడియం లేకపోతే పిల్లలకు భవిష్యత్ వుండదు అని తెలుసే ప్రవేశ పెట్టామన్నారు. పిల్లలు స్కూల్స్ కి వెళ్లే సమయంలో ఇబ్బంది పడకూడదని విద్య కానుక పెట్టామన్నారు. పేదరికం చదువుకు అడ్డు కాకూడదని అమ్మ ఒడి కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు.

విద్యార్థులకు మేలు జరగాలని విద్య దీవెన విద్య వసతి ప్రవేశ పెట్టామన్నారు జగన్. చదువుతున్న సమయంలోనే స్కిల్స్ కు సంబందించిన అంశాలు గుర్తించి వారికి శిక్షణ ఇస్తున్నామన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ద్వారా మంచి ఉద్యోగాలు వస్తాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version