ఒకప్పుడు జంతువుల మధ్య కూడా అంత సఖ్యత ఉండేది కాదు. పిల్లి-కుక్క అంటే వైరం అని వాటిని కలిపి పెంచేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు ఏ జంతువులు అయినా తమ బలా బాలలను పక్కన పెట్టి మరి సహా జంతువులతో చాలా ఫ్రెండ్లి గా ఉంటున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి దృశ్యాలు చాలానే చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఒక వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. నిజంగా ఈ వీడియో చూస్తే మనుషులు జంగిల్ లో ఉన్నారో,లేక జంతువులు జంగిల్ లో ఉన్నాయా అన్న విషయం మాత్రం అర్ధంకాదు. నిజంగా జంతువుల మధ్య ప్రేమలు చూస్తే మాత్రం అలానే అనిపిస్తుంది. కన్న బిడ్డల నే కర్కశంగా ప్రవర్తిస్తున్న ఈ రోజుల్లో ఈ రెండు మూగ జీవాల మధ్య చోటుచేసుకున్న ఈ ఘటన అందరినీ కదిలిస్తుంది. మనుషూల్ మధ్య ఈర్ష్య,ద్వేషాలతో రగిలిపోతూ ఒకరినొకరు చంపుకొనే రోజులు వచ్చాశాయి. కానీ జంతువులు మాత్రం అలాంటి రాగద్వేషాలకు అతీతంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. రెండు చింపాంజీలు యాపిల్ పండ్లను తింటున్నాయి. పక్కనే ఓ తాబేలు కూడా ఉంది. అయితే ఒక చింపాంజీ తాను తింటోన్న యాపిల్‌ను తాబేలు నోటికి అందించింది. తాను ఒక బైట్ తిని, మరో బైట్ తాబేలుకు అందిస్తుంది.
అలా దాని ఆకలి తీర్చింది. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో ఫోస్ట్ చేయడం తో ఈ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. “ప్రేమను పంచుకోవడం ద్వారా మాత్రమే పెరుగుతుంది” అనే క్యాప్షన్‌ను పెట్టి మరి ఈ వీడియోను జోడించారు.