యుద్ధానికి చైనా సిద్ధమవుతోందా…?

-

పొరుగునే ఉన్న తైవాన్‌ పై యుద్ధభేరీ మోగించాలని చైనా ప్రయత్నాలు చేస్తోందా.. ? డ్రాగన్‌ యుద్ధ సన్నాహాలు చేస్తోందని అమెరికా రక్షణవర్గాలు చెబుతున్నాయి. తైవాన్‌ ధీటుగా స్పందించేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నాయి.

తైవాన్‌పై సైనిక దాడికి దిగేందుకు చైనా సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సరిహద్దులకు భారీ స్థాయిలో బలగాలను, ఆయుధాలు తరలించినట్లు అమెరికా రక్షణశాఖ అధికారులు గుర్తించారు. డీఎఫ్‌-11, డీఎఫ్‌-15 క్షిపణుల స్థానంలో అత్యాధునిక హైపర్‌సోనిక్‌ డీఎఫ్‌-17 క్షిపణుల్ని మోహరించినట్లు చెబుతున్నారు. ఫుజియాన్‌, గ్వాన్‌డాంగ్‌లోని రాకెట్‌ ఫోర్స్‌, మెరైన్‌ కార్ప్స్‌ స్థావరాల్ని సైతం విస్తరించినట్లు కన్వా డిఫెన్స్‌ రివ్యూ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా అమెరికా అధికారులు గుర్తించారు. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని క్షిపణి స్థావరాల్ని రెండింతలకు పెంచినట్లు ఈ రివ్యూ స్పష్టం చేస్తోంది.

ఇటీవలే తైవాన్‌ సరిహద్దుల్లో చైనా సైనిక విన్యాసాల్ని పెంచింది. కొన్నిరోజుల క్రితం గ్వాన్‌డాంగ్‌లోని సైనిక స్థావరాన్ని సందర్శించిన అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌.. సైనికులంతా తమ దృష్టిని యుద్ధ సన్నద్ధతపైనే ఉంచాలని పిలుపునిచ్చారు.

తైవాన్‌పై చైనా దాడికి సిద్ధమవుతోందని అమెరికా రక్షణ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చైనా దండయాత్రను ఎదుర్కొనేందుకు తైవాన్‌ సిద్ధంగా ఉండాలని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రయాన్‌ సూచించారు. భూసరిహద్దులతో పాటు, జలమార్గాల్లోనూ డ్రాగన్‌ సేనల్ని దీటుగా తిప్పికొట్టే వ్యూహాలతో తైవాన్‌ సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version