నిత్యం వివాదాలతో ఉండేటువంటి.. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వల్ల ఏపీ ప్రభుత్వనికి తలనొప్పి తప్పదు అంటూ పలువురు తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆయనపై పదుల సంఖ్యలో కేసులు ఉండటంతో పాటు కొద్ది నెలల క్రితం ఓ ఆర్టీసీ కార్మిక నాయకుడిపై సైతం ఆయన స్థాయి మరచి వ్యవహరించడంతో తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. వీటన్నింటి పర్యావసానమే…చింతమనేనిని అరెస్టు చేయాలంటూ ఈ నెల 23న వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చేపడుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ప్రకటనలో ..గత నాలుగున్నరేళ్లుగా చింతమనేని అరా చకాల్ని ముఖ్యమంత్రి సమర్ధిస్తూనే పేర్కొన్నారు. పరోక్షంగా సీఎం చంద్రబాబే ఈ అరాచకాలకు కారకులుగా భావించాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం వచ్చిన కొత్తలో తహశీల్దార్ వనజాక్షిపై చింతమేనని దాడి చేసినా చర్యలు తీసుకోకపోవడంతో అతని ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందంటూ ఆరోపించారు. క్షమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే తెదేపా … ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే చింతమనేనిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు ఆగ్రహం…
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని తీరు మారకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. తాజా ఘటన నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకులు శనివారం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సీఎం.. సహనానికి పరీక్ష పెడితే సహించేది లేదని తనను కలిసిన నేతల్ని హెచ్చరించారు. పనిచేస్తే సరిపోదనీ, పద్ధతిగా ఉంటే నే పార్టీలో భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని గుర్తించుకోవా లనీ చింతమనేని ప్రభాకర్‌ను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. పార్టీలో ఒకరిద్దరు చేసే తప్పుకి పార్టీ మొత్తం పేరు మోయాల్సి వస్తోందన్నారు. ఇకనైనా చింతమనేనిని అదుపు చేయకపోతే పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైందంటూ సీఎం వారికి వివరించారు.