రక్తదానం చేసిన చిరంజీవి, శ్రీకాంత్.. ప్రాణాలు కాపాడాలని పిలుపు

-

ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తున్న వేళ.. తెలుగు ప్రజల్లో ఆ మహమ్మారిపై అవగాహన కల్పించడంలో మెగాస్టార్ చిరంజీవి తనవంతు పాత్ర పోషిస్తున్నారు. అలాగే సినీ కార్మికులను ఆదుకునే పెద్ద దిక్కుగా కూడా నిలిచారు. కరోనాతో షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు సాయం అందించేందుకు కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను పాటిస్తూ కరోనా నియంత్రణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్నారు.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా వివిధ ఆస్పత్రుల్లో ఇతర చికిత్సలు పొందుతున్న పెషేంట్లకు బ్లడ్ సకాలంలో అందని పరిస్థతి నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, తనవంతు సాయం అందించడానికి చిరంజీవి ముందుకొచ్చారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో ఆయన రక్తదానం చేశారు. చిరంజీవితోపాటుగా హీరో శ్రీకాంత్, అతని కుమారుడు కూడా బ్లడ్ డోనెట్ చేశారు. ఈ సందర్భంగా రక్తదాతలు ముందుకు రావాలని చిరంజీవి పిలుపునిచ్చారు. రక్తదానం చేయండి.. ప్రాణాలను నిలబెట్టండి అని కోరారు. రక్తదానం చేసే వారికి పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవని.. ఇందుకు సంబంధించి తాను సైబరాబాద్ సీపీ సజ్జనార్‌తో మాట్లాడినట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

“ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా.. రక్తదాతల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కొన్ని చోట్ల పెషేంట్లకు బ్లడ్ లభించక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొసారి బ్లడ్ దొరక్క పోవడం ప్రాణాల మీదకు తెస్తోంది. ముఖ్యంగా హార్ట్ ఆపరేషన్ జరిగేటప్పుడు, డెలివరీ సమయంలో మహిళలకు, తలసేమియా , క్యాన్సర్ పెషేంట్లు.. ఇలా ఎంతో మంది అవసరానికి బ్లడ్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు.

ఇలాంటి సమయంలో రక్తదాతలు అందరికీ, నా అభిమానులకు.. ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను.. ప్లీజ్ రక్తదానం చేయండి. ప్రాణాలు నిలబెట్టండి. అది ఇచ్చే సంతృప్తి అంత ఇంత కాదు. పోలీసులతో ఇబ్బంది ఉందని అంటున్నవారు.. మీ దగ్గర ఉన్న బ్లడ్ బ్యాంక్ గానీ, ఆస్పత్రలను గానీ సంప్రదిస్తే వారు మీకు సాయం చేస్తారు. మీకు ఓ మెసేజ్ పంపిస్తారు. అది చూపిస్తే పోలీసులు మీకు అభ్యంతరం చెప్పరు. ఇందుకు సంబంధించి నేను సైబరాబాద్ సీపీ సజ్జనార్ గారితో మాట్లడినప్పుడు ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. అలాగే ఓ నంబర్ కూడా ఇచ్చారు. రక్తదానం చేయండి.. ప్రాణాలను నిలబెట్టండి” అని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version